ఢిల్లీలో బోనాల వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ సీపీ రాధాకృష్ణన్

ఢిల్లీలో బోనాల వేడుకల్లో పాల్గొన్న గవర్నర్  సీపీ రాధాకృష్ణన్

హైదరాబాద్, వెలుగు: దేవుడు ఒక్కడేనని, అయినా భిన్న రూపాల్లో కొలవడమే సెక్యులరిజానికి నిర్వచనమని గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ అన్నారు. బుధవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో జరిగిన బోనాల వేడుకల్లో గవర్నర్ పాల్గొన్నారు. బంగారు బోనం ఎత్తుకుని వచ్చిన ఆయనకు లాల్ దర్వాజా బోనాల కమిటీ సభ్యులు స్వాగతం పలికారు.

బోనం సమర్పించిన అనంతరం గవర్నర్ మాట్లాడుతూ.. గోల్కొండ కోటలో బోనాల్లో పాల్గొన్నానని చెప్పారు. మన సంస్కృతి, సంప్రదాయాలు బోనాల్లో కనపడుతున్నాయని పేర్కొన్నారు. ఢిల్లీలో బుధవారం స్టార్ట్ అయిన బోనాలు రెండు రోజుల పాటు జరగనున్నాయి.