
తెలంగాణ రాష్ట్ర కొత్త గవర్నర్‌గా జిష్ణుదేవ్ వర్మ బుధవారం జూలై 31, 2024 సాయంత్రం 5గంటలకు రాజ్ భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే ఆయనతో ప్రమాణం చేయించనున్నారు.
కొత్త గవర్నర్ ప్రమాణ స్వీకారోత్సవానికి రావాల్సిందిగా సీఎం రేవంత్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ప్రతిపక్ష నేత కేసీఆర్, కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, ఎం ఐఎం పక్ష నేత అక్బరుద్దీన్, ఆయా పార్టీల ఎంపీలు, ఎమ్మెల్యేలకు రాజ్‌భవన్ నుంచి ఇప్పటిచేఆహ్వానం అందాయి.
జిష్ణుదేవ్ వర్మ 2018–23 మధ్యకాలంలో త్రిపుర డిప్యూటీ సీఎంగా పనిచేశారు. తెలంగాణ నాల్గవగవర్నర్‌గా జిష్ణుదేవ్ బాధ్యతలు చేపట్టనున్నారు. తెలంగాణ గవర్నర్లుగా ఇప్పటి వరకు ఈఎస్‌ఎల్ నరసింహన్, తమిళిసై సౌందరరాజన్, ఇన్‌చార్జి గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్ ఉన్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలో ఢిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న గవర్నర్ జిష్ణు దేవ్ వర్మకు శంషాబాద్ విమానాశ్రయంలో శాలువా కప్పి బొకే అందించి స్వాగతం పలికారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. సీఎంతో పాలు డీజీపీ జితేందర్ కూడా ఉన్నారు.