
తిరుమల: గవర్నర్ నరసింహన్ దంపతులు మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో గవర్నర్ దంపతులు స్వామి వారి సేవలో పాల్గొన్నారు. అంతకుముందు వారు క్షేత్ర సంప్రదాయాన్ని పాటిస్తూ శ్రీవరాహస్వామిని దర్శించుకున్నారు. గవర్నర్ దంపతులు శ్రీవారి పుష్కరిణిలోకి చేరుకొని పవిత్ర జలాలను తలపై చల్లుకున్నారు.
గవర్నర్ దంపతులకు TTD ఈవో స్వాగతం పలికి, మేళతాళాలతో శ్రీవారి సన్నిధికి తీసుకెళ్లారు. రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం పలుకగా తీర్థప్రసాదాలను, స్వామివారి చిత్రపటాన్ని గవర్నర్ దంపతులకు అందజేసి సత్కరించారు.