రక్త దానంపై అందరికీ అవగాహన రావాలి

రక్త దానంపై అందరికీ అవగాహన రావాలి

ఇవాళ వరల్డ్ బ్లడ్ డోనర్ డే(ప్రపంచ రక్త దాతల దినోత్సవం). ఈ సందర్భంగా తెలంగాణ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రాజ్ భవన్ లోని సంస్కృతి హాల్ లో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. ప్రతి రక్తపు బొట్టు ఒక  వ్యక్తిని కాపాడుతుందన్నారు. బోనాలు, బతకమ్మ, దివాళి లనే ఈ రోజు కూడా ఒక పండగల జరుపుకోవాలన్నారు. ఎవరికి సహాయం చేస్తున్నామో తెలియకుండా చేసే ఒకే దానం రక్త దానం అన్నారు. అందరికి రక్త దానంపై అవగాహన రావాలి.. డొనేట్ చేస్తేవారి ఆరోగ్యం కూడా బాగుంటుందని గవర్నర్ తెలిపారు.
 
అపద సమయంలో మన దగ్గరి బంధువులు కూడా రక్త దానం చేయాదనికి ముందుకు రారు.. కానీ రక్త దాతలు మాత్రం ముక్కుమొహం తెలియని వారికి సహాయం చేస్తున్నారని గవర్నర్ ప్రశంసించారు. అన్ని జిల్లాలో  మంచి స్టోరేజి సౌకర్యం ఉంది. ఆర్మీ, పోలీస్ లు కోవిడ్ సమయంలో రక్త దానం చేసి తలసెమియా రోగులకు సహాయం చేశారని కొనియాడారు. కలెక్టర్లు కూడా ఈ కార్యక్రమంలో భాగం కావడం సంతోషంగా ఉంది.రాజ్ భవన్ కూడా ఎప్పుడూ సేవలు చేయాడానికి సిద్ధంగా ఉంటుందని గవర్నర్ పేర్కొన్నారు.