విద్యార్థులు ఉన్నత లక్ష్యాలపై దృష్టి పెట్టాలి : గవర్నర్

విద్యార్థులు ఉన్నత లక్ష్యాలపై దృష్టి  పెట్టాలి : గవర్నర్

విద్యార్ధులు ఉన్నత లక్ష్యాలపై దృష్టి పెట్టాలని గవర్నర్ తమిళ సై సౌందర రాజన్ తెలిపారు. విద్యతో పాటు పోటీలు.. అటల్లో కూడా ముందుండాలని సూచించారు. స్టూడెంట్ లైఫ్ లో ఎంజాయి మేంట్ తో పాటు ఎడ్యుకేషన్ ఇంపార్ట్ టెంట్ గా చూసుకోవాలని చెప్పారు. చిన్న చిన్న సమస్యలకు విద్యార్థులు కుంగిపోవద్దని..ఎన్ని అవాంతరాలు ఎదురైనా అనుకున్న లక్ష్యాలు సాధించాలన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైన తాను చదువును ఎక్కడా ఆపలేదని స్పష్టం చేశారు. కష్టపడి చదివి  అనుకున్న లక్ష్యాలను సాధించానని స్పష్టం చేశారు. 

కష్టపడి ఇంత దూరం వచ్చి గవర్నర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నా.. ఎన్నో ముళ్ళు..రాళ్ళు ముందున్నా  కూడా చెదరని చిరునవ్వు తో ముందుకు సాగుతున్నాని తమిళిసై తెలిపారు. G20 నిర్వహణ కోసం ప్రధాని నిరంతరం శ్రమిస్తున్నారని..G20 అధ్యక్ష స్థానంలో భారత్ ఉండటం మనందరికీ గర్వ కారణమన్నారు. వాతావరణ మార్పులు...ప్రతి దేశ ఆర్థిక అభివృద్ధి. వ్యాధుల నివారణ ప్రధాన లక్ష్యం గా G20 నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ సదస్సు లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని సూచించారు.