ఆర్టీసీ బిల్లుపై మరోసారి క్లారిటీ ఇచ్చిన రాజ్ భవన్

ఆర్టీసీ బిల్లుపై మరోసారి క్లారిటీ ఇచ్చిన రాజ్ భవన్

ఆర్టీసీ విలీనం బిల్లుపై మరోసారి క్లారిటీ ఇచ్చింది రాజ్ భవన్. సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియకు సంబంధించిన బిల్లుపై కొన్ని సందేహాలను వ్యక్తం చేస్తూ వాటిని క్లారిఫై చేయాలని గవర్నర్ తమిళిసై సీఎస్ శాంతికుమారికి లేఖ రాశారు. బిల్లును నిన్నే అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావించింది. గవర్నర్ అనుమతి రాకపోవడంతో అది కాస్త ఆగింది. గవర్నర్ కావాలనే బిల్లును ఆపుతున్నారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఆర్టీసీ కార్మిక సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి. దీంతో రాజ్ భవన్ ప్రకటన విడుదల చేసింది. 

ఆర్టీసీ ఉద్యోగుల విలీన బిల్లును గవర్నర్ నిశితంగా పరిశీలించారని.... కొన్ని అంశాలపై క్లారిటీ కోసం.... వివరణ ఇవ్వాలని సీఎస్ లేఖ రాశామని చెప్పింది రాజ్ భవన్. ఆర్టీసీ కార్మికులు, రాష్ట్ర ప్రయోజనాల కోసం వివరణ అవసరమని భావిస్తున్నామంది.  ప్రభుత్వం నుంచి వెంటనే సమాధానం వస్తే బిల్లును గవర్నర్ త్వరగా నిర్ణయం తీసుకోవడానికి వీలవుతుందని ప్రకటనలో తెలిపింది రాజ్ భవన్.