Bigg Boss Telugu 9 : బిగ్ బాస్9 ఫినాలే ముందు ఫన్ ఓవర్‌లోడ్.. తనూజ 'కళ్యాణ రేఖ' గుట్టు విప్పిన ఇమ్మూ!

Bigg Boss Telugu 9 : బిగ్ బాస్9 ఫినాలే ముందు ఫన్ ఓవర్‌లోడ్.. తనూజ 'కళ్యాణ రేఖ' గుట్టు విప్పిన ఇమ్మూ!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 క్లైమాక్స్ కు చేరుకుంది. మరో నాలుగు రోజుల్లో గ్రాండ్ ఫినాలే (డిసెంబర్ 21న ) జరగనుండటంతో ప్రేక్షకుల్లో ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం టైటిల్ ట్రోఫీ కోసం హౌస్ లో తనూజ, కల్యాణ్, ఇమ్మన్యుయేల్, డిమాన్ పవన్, సంజన తీవ్రంగా కష్టపడుతున్నారు. అయితే, ఈ టెన్షన్ మధ్య హౌస్‌మేట్స్‌కు కాస్త ఉపశమనం కలిగిస్తూ.. 101వ రోజు ఎపిసోడ్ 'ఫన్ ఓవర్‌లోడ్'గా సాగింది. ముఖ్యంగా కమెడియన్ ఇమ్మానుయేల్ తన మార్కు టైమింగ్‌తో హౌస్‌ను నవ్వుల జాతరగా మార్చేశాడు. 

ఇమ్మానుయేల్ 'వన్ మ్యాన్ షో'

ఈ రోజు ( డిసెంబర్ 17న ) ఎపిసోడ్‌లో ఇమ్మానుయేల్ జోతిష్యుడి అవతారమెత్తి వన్ మ్యాన్ షో చేశాడు. "రండమ్మా.. రండి.. మీ జాతకాలు చెబుతాను" అంటూ గలగలా మాట్లాడేస్తూ ఇంటి సభ్యులందరినీ ఆటపట్టించాడు. మొదటగా సంజనతో మొదలుపెట్టిన ఇమ్మూ.. మీరు ఒక యాభై సినిమాల్లో చేశారు కదా.. నాకు ఎలా తెలిసిందని ఆశ్చర్యపోకండి. గొడవైనప్పుడల్లా మీరే పదిసార్లు చెబుతుంటారుగా.. అంటూ సెటైర్ వేశాడు.

డెమాన్ పవన్ 'రేఖల' గోల

 ఇక డిమాన్ పవన్ చేయి చూస్తూ ఇమ్మూ చేసిన హంగామా మామూలుగా లేదు. "రేఖలేవిరా.. రేఖలేవీ? 14 వారాలు ఏం చేశావ్ రా.. జూమ్ చేసినా ఒక్క రేఖ కూడా కనిపించడం లేదు. ఏం చేత్తో ఏం చేశావ్?" అంటూ డబుల్ మీనింగ్ డైలాగులతో చెమటలు పట్టించాడు. ఇక పవన్ ఫ్యూచర్ గురించి చెబుతూ.. నీ ఫ్యూచర్ నీ పక్కన ఉన్న వాళ్లపై ఆధారపడి ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ 'రీతూ' నీ పక్కన లేదు కాబట్టి, నీ ఫ్యూచర్ అద్భుతంగా ఉంది అని అనడంతో హౌస్‌లో నవ్వులు విరిశాయి.

తనూజ 'కళ్యాణ రేఖ'..

ఆ తర్వాత తనూజ చేయి చూస్తూ ఇమ్మానుయేల్ చేసిన సందడి ఎపిసోడ్‌కే హైలైట్. ఆమె చేయిని పదే పదే రుద్దుతూ.. "ఇది మామూలు రేఖ కాదు.. కళ్యాణ రేఖ" అని చెప్పడంతో కళ్యాణ్ పకపకా నవ్వేశాడు. తనూజ కూడా కాస్త సిగ్గుపడుతూనే, "నాకు కాబోయే హస్బెండ్ గురించి చెప్పు" అని అడగ్గా.. "ఇంత సేపు చెప్పింది వాడి (కళ్యాణ్) గురించే కదా అని ఇమ్మూ బాంబు పేల్చాడు. దీంతో తనూజ అతన్ని ముద్దుగా బాదేసింది. 

చివర్లో కళ్యాణ్ చేయి చూస్తూ.. "వీడికి జాతకం చెబితే నా జాతకమే పోతుంది" అంటూ ఇమ్మానుయేల్ పారిపోవడంతో 101వ రోజు ప్రోమో అత్యంత వినోదాత్మకంగా ముగిసింది. సీజన్ మొత్తం గొడవలు, టాస్క్‌లతో సీరియస్‌గా సాగినా, ఫినాలే ముందు ఇలాంటి 'హిలేరియస్' మూమెంట్స్ చూడటం ప్రేక్షకులకు కనువిందుగా ఉంది. గెలుపు ఓటముల లెక్కలు పక్కన పెడితే, ఫైనల్ వీక్‌లో కంటెస్టెంట్స్ మధ్య కనిపిస్తున్న బాండింగ్ ఆకట్టుకుంటోంది. మరి ఈ ఐదుగురిలో ఆ మెరిసే ట్రోఫీని ముద్దాడేది ఎవరో తెలియాలంటే డిసెంబర్ 21 వరకు వేచి చూడాల్సిందే..