రాజ్ భవన్లో ఘనంగా ఎట్ హోం

రాజ్ భవన్లో ఘనంగా ఎట్ హోం

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతిఏటా రాజ్ భవన్ లో నిర్వహించే ఎట్ హోం కార్యక్రమం ఘనంగా జరిగింది. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి బీజేపీ కోర్ కమిటీ సభ్యులు వివేక్ వెంకటస్వామి, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్ రావు, మాజీ ఎమ్మెల్సీ రాం చందర్ రావు, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్. రమణ, సీఎస్ సోమేష్ కుమార్ హాజరయ్యారు. 

సీఎం కేసీఆర్ మాత్రం ఎట్ హోం కార్యక్రమానికి డుమ్మాకొట్టారు. దీనిపై స్పందించిన గవర్నర్ తమిళిసై ఎట్ హోంకు రావాలని తాను పర్సనల్ గా సీఎం కేసీఆర్, చీఫ్ జస్టిస్ కు లెటర్ రాసినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సాయంత్రం 6.55 గంటలకు వస్తారని సీఎంఓ వర్గాలు తమకు సమాచారం అందించాయని చెప్పారు. అయితే.. కేసీఆర్ రాక కోసం తనతో పాటు చీఫ్ జస్టిస్ దాదాపు అరగంట పాటు వెయిట్ చేశామని గవర్నర్ చెప్పారు. అతిథులంతా ఎదురుచూస్తుండటంతో కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. సీఎం కేసీఆర్ ఎట్ హోంకు రాకపోవడంపై సీఎంఓ వర్గాలు ఎలాంటి సమాచారంఇవ్వలేదని గవర్నర్ తమిళిసై స్పష్టం చేశారు.

ఇదిలా ఉంటే ఎట్ హోం కార్యక్రమానికి సీఎం కేసీఆర్ గైర్హాజరు కావడంపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సటైర్ వేశారు. ముఖ్యమంత్రికి కరోనా వచ్చి ఉంటుందని  అందుకే రాలేకపోయారేమో అని చురకలంటించారు.