హైదరాబాద్ లో నుమాయిష్ షురూ

హైదరాబాద్ లో నుమాయిష్ షురూ

నగరంలో ఆలిండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఏర్పాటుచేసిన నుమాయిష్ ను  హోంమంత్రి మహమూద్ అలీతో కలిసి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రారంభించారు.  ఈ సందర్భంగా మాట్లాడిన తమిళి సై.. హైదరాబాద్ నుమాయిష్ కు ఎంతో చరిత్ర ఉందన్నారు.ఎగ్జిబిషన్ లో కరోనా రూల్స్ తప్పక పాటించాలన్నారు. మాస్క్ పెట్టుకోని వారిని నుమాయిష్ కు అనుమతించొద్దని అధికారులను ఆదేశించారు గవర్నర్.

మొత్తం 45రోజుల పాటు ఈ నుమాయిష్ జరగనుంది. ఎగ్జిబిషన్ కు వచ్చే సందర్శకులు తప్పనిసరిగా కరోనా నిబంధలున పాటించాన్నారు నిర్వాహకులు. కరోనా కారణంగా గతేడాది నుమాయిష్ జరగలేదు.ఒమిక్రాన్ వ్యాప్తి దృష్ట్యా ఈ సారి కూడా  స్టాళ్లను తగ్గించారు. గతంలో 2 వేలకు పైగా స్టాళ్లు ఏర్పాటు చేయగా ఈ సారి 1600 స్టాళ్లకు తగ్గింది.