"తపస్" డైరీని ఆవిష్కరించిన గవర్నర్ తమిళిసై

"తపస్" డైరీని ఆవిష్కరించిన గవర్నర్ తమిళిసై

తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(TPUS) 2023 డైరీని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సుందర్ రాజన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విద్యా, ఉపాధ్యాయుల కొన్ని సమస్యలను TPUS రాష్ట్ర అధ్యక్షడు హన్ముంత్ రావు గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు.ప్రతి పాఠశాలల్లో స్కావెంజర్ల నియామకం చేయాలని, ఉపాధ్యాయులకు పదోన్నతులు బదిలీలు నిర్వహించాలని కోరారు. G.0.317 బాధితులను సమస్యలను పరిష్కరించాలని, జీతాల చెల్లింపులో నమ్మశక్యం కాని జాప్యం జరుగుతుందని.. ప్రతి నెలలో ఒకటో తేదీ నాడు జీతాలు చెల్లించాలని వివరించారు. 

మెడికల్ రీయింబర్స్‌మెంట్ వంటి పెండింగ్ బిల్లులు, సరెండర్, GPF లోన్‌లు, పార్ట్ ఫైనల్, ఫైనల్ పేమెంట్- -రిటైర్‌మెంట్ ప్రయోజనాలు నెలల తరబడి నిరీక్షించవలసి వస్తుందని అన్నారు. కొన్నిసార్లు ఏడాది కూడా అవుతుందని ప్రభుత్వం సమస్యలను పరిష్కరించేలా కృషి చేయాలని గవర్నర్ కు విజ్ఞప్తి చేశామని రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు తెలిపారు.ఈ కార్యక్రమంలో ABRSM ప్రతినిధి సూరం విఘ్ణ వర్దన్ రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు అయిల్నేని నరేందర్ రావు లు పాల్గొన్నారు.