అర్హులైన వారంతా వ్యాక్సిన్ తీసుకోవాలి

అర్హులైన వారంతా వ్యాక్సిన్ తీసుకోవాలి

హైదరాబాద్: దేశాన్ని, రాష్ట్రాన్ని కరోనా రహితంగా చేయాలంటే ప్రజలంతా తప్పక టీకా తీసుకోవాలని రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ పిలుపునిచ్చారు. మొదటి దశలో కరోనా వారియర్స్ కి వ్యాక్సినేషన్ చేశారని, రెండవ దశ లో కూడా 60 సంవత్సరాల పై బడిన వారికి, 45 సంవత్సరాలు పై బడిన వారికి,  ఏవైనా వ్యాధులు ఉన్న వారికి వ్యాక్సినేషన్ చేస్తున్న విషయాన్ని ఆమె తెలిపారు.

గౌరవ నీయులు ప్రధానమంత్రి వ్యాక్సినేషన్ తీసుకున్నట్టు గవర్నర్ పేర్కొన్నారు. కోవిడ్ పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని, లేదంటే మళ్లీ వైరస్ వ్యాపించే అవకాశముందన్నారు. అర్హులైన అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని గవర్నర్ కోరారు. ప్రభుత్వం అందరికి ఉచితంగా వ్యాక్సినేషన్ చేస్తున్నారని చెప్పారు