తెలంగాణ యూనివర్సిటీల్లో మరిన్ని వసతులు అవసరం: తమిళిసై

తెలంగాణ యూనివర్సిటీల్లో మరిన్ని వసతులు అవసరం: తమిళిసై

ఉన్నత విద్య అంశంలో తెలంగాణ గురించి దేశం మొత్తం మాట్లాడుకోవాలనేది నా కల అని అన్నారు గవర్నర్ తమిళి సై సౌందర రాజన్. రాజభవన్ లో జరిగిన ఛాన్సులర్  కనెక్ట్స్ అలుమ్నీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆమె.. యూనివర్సీటీలు అకాడమిక్ యాక్టివిటీస్ ను మర్చిపోయాయి.. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో మరిన్ని వసతులు అవసరమన్నారు తమిళిసై.  

ALSO READ : యోగా చేస్తోన్న టెస్లా రోబో.. నమస్తే కూడా పెడుతోంది

తెలంగాణ యూనివర్సిటీలు విదేశీ విశ్వ విద్యాలయాలకంటే ఉన్నతంగా ఉండాలి.  అంతర్జాతీయ యూనివర్సిటీల గురించి విద్యార్థులు ఎలా చెప్తున్నారో అలా తెలంగాణ యూనివర్సీటీల గురించి కూడా చెప్పుకోవాలని అన్నారు తమిళిసై. రిమోట్ ఏరియా విద్యార్థులకు విద్యను అందించే విధంగా డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేసామన్నారు గవర్నర్. అలుమ్ని కనెక్ట్స్ అనేది చాలా ముఖ్యం...అలుమ్ని వల్ల మారుమూల విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.