యోగా చేస్తోన్న టెస్లా రోబో.. నమస్తే కూడా పెడుతోంది

యోగా చేస్తోన్న టెస్లా రోబో.. నమస్తే కూడా పెడుతోంది

విద్యుత్‌ కార్లు, అటానమస్‌ కార్ల తయారీలో తనదైన ముద్ర వేసిన టెస్లా (Tesla) రోబోటిక్‌ రంగంలోనూ రాణించేందుకు సిద్ధమైంది. టెస్లా కంపెనీ తయారు చేసిన భవిష్యత్‌ హ్యుమనాయిడ్‌ రోబో ‘ఆప్టిమస్‌’ (humanoid robot Optimus)కు సంబంధించిన వీడియోను ఎక్స్‌ (ట్విటర్‌)లో పంచుకుంది. ఈ వీడియోనూ ఇప్పటికే పది మిలియన్ల కంటే ఎక్కువ మంది చూశారు. 

హ్యుమనాయిడ్‌ రోబో యోగా కూడా చేస్తోంది. వస్తువులను గుర్తించి వాటిని ఓ క్రమ పద్ధతిలో పెడుతోంది. అంతేకాదు.. మనిషి కంటే వేగంగా చేయగలుగుతోంది. మనిషి మధ్యలో ఏవైనా మార్పులు చేసి పనిని మరింత కష్టతరంగా మార్చినా.. రోబో దాన్ని కూడా అర్థం చేసుకోగలుగుతోంది.

Also Read : IND vs AUS: మూడో వన్డేలో ఆ ఇద్దరికీ రెస్ట్..కోహ్లీ, రోహిత్ పరిస్థితి ఏంటి..?

యోగాలో వివిధ రకాల భంగిమలను ప్రదర్శిస్తోంది. తన కాళ్లు, చేతులపై పూర్తి నియంత్రణను కలిగి ఉంది. టెస్లా కార్ల తరహాలోనే న్యూరల్‌ నెట్‌వర్క్‌ ద్వారా వీడియో ఇన్‌పుట్‌ను సమీక్షించి దానికి అనుగుణంగా ఔట్‌పుట్‌ను అందిస్తోంది.

ఆప్టిమస్ యోగ చేయడం మొదలుపెట్టింది. ఒక కాలు మీద నిలుచోని బాడీని స్ట్రెచ్ చేయడం, బ్యాలెన్డ్స్ గా ఉండడం లాంటివి చేసింది. వృక్షాసనం వేసిన రోబో నమస్తేను చాలా చక్కగా పెట్టింది. 

టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ ఈ వీడియోపై స్పందించారు. హ్యుమనాయిడ్‌ రోబో తయారీలో పురోగతి సాధించినట్లు చెప్పారు. టెస్లా నుంచి మరో అద్భుతమైన పురోగతి అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ‘టెస్లాబోట్‌’గా పేర్కొంటున్న ఈ రోబో ఎప్పుడు అందుబాటులోకి తీసుకొస్తారనే విషయాన్ని కంపెనీ చెప్పలేదు.