చేసే పనిని చాలెంజింగ్ గా తీసుకొని పోరాడాలి

చేసే పనిని చాలెంజింగ్ గా తీసుకొని పోరాడాలి
  •     విమెన్స్​ డే వేడుకల్లో గవర్నర్​ తమిళిసై

హైదరాబాద్/ముషీరాబాద్, వెలుగు: పెద్ద పెద్ద ఆఫీసుల్లో ఉన్నా వివక్ష ఎదుర్కొంటున్నామని గవర్నర్ తమిళిసై సౌందరాజన్ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం రాజ్ భవన్​లో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో ఆమె మాట్లాడారు. చేసే పనిని చాలెంజింగ్ గా తీసుకొని పోరాడాలన్నారు. ఈ సందర్భంగా పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన పద్మజారెడ్డి, సోషల్ వర్కర్లు నోముల హేమలత, ప్రీతిరెడ్డి, సాత్విక, జయలక్ష్మి, మహాలక్ష్మి, మామిడి రచన, నిహార మోహన్​ను గవర్నర్ సన్మానించారు.హైకోర్టు జడ్జీలు శ్రీసుధ, రాధారాణి, మాధవి దేవి, ఎమ్మెల్యే సీతక్క,  జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత, మాజీ ఎమ్మెల్యే పద్మావతి, వివిధ రంగాలకు చెందిన 300 మంది మహిళలు పాల్గొన్నారు. అలాగే అక్షర స్ఫూర్తి ఆధ్వర్యంలో హైదరాబాద్​ త్యాగరాయ గానసభలో నిర్వహించిన విమెన్స్ ​డే వేడుకల్లో గవర్నర్ తో పాటు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ పాల్గొని మహిళా ప్రముఖులను సన్మానించారు.  
అన్నింట్లో స్టాండ్​ తీసుకోవాలనుకోవట్లేదు

యాదగిరిగుట్ట: అసెంబ్లీలో బడ్జెట్​పై తన ప్రసంగం లేకపోవడంపై ఇప్పటికే అభిప్రాయాన్ని తెలిపానని, ప్రతి విషయంలో ఏదో ఒక స్టాండ్ తీసుకోవాలని అనుకోవట్లేదని గవర్నర్​ అన్నారు. సోమవారం ఆమె యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని మాట్లాడారు. స్టేట్​బడ్జెట్ ప్రజలకు లబ్ధిచేకూరేలా ఉండాలని ఆకాంక్షించారు. తాను తమిళనాడుకు చెందిన మహిళనైనా తెలంగాణ ప్రజలతో రెండేండ్లుగా మమేకమైనట్టు చెప్పారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు వటపత్రశాయి అలంకారంలో దర్శనమివ్వగా గవర్నర్ ప్రత్యేక పూజలు చేశారు.