
న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో ఫేక్ కంటెంట్‌పై కేంద్రం సీరియస్ అయింది. ఫేక్ కంటెంట్‌ను సర్క్యులేట్ చేస్తూ, రెచ్చగొట్టే పోస్టులు పెడుతున్న సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేసింది. ట్విట్టర్, యూట్యూబ్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్‌లో ఇలాంటి అకౌంట్లను గుర్తించి బ్లాక్ చేశామని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ట్వీట్ చేశారు. ఆ అకౌంట్ల ఓనర్లను గుర్తించి, చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. 73 ట్విట్టర్ హ్యాండిళ్లు, 4 యూట్యూబ్ చానెళ్లు, ఒక ఇన్ స్టాగ్రామ్ గేమ్‌ను తొలగించామని అధికారులు తెలిపారు. కాగా, ప్రధాని మోడీ, కేబినెట్ మీటింగ్‌కు సంబంధించి ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయని ఫిర్యాదులు రావడంతో కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది.