ప్రభుత్వాస్పత్రుల్లో పదేళ్లు పని చేయాలె.. లేకుంటే కోటి ఫైన్

ప్రభుత్వాస్పత్రుల్లో పదేళ్లు పని చేయాలె.. లేకుంటే కోటి ఫైన్

పోస్టు గ్రాడ్యుయేషన్ మెడికల్ స్టూడెంట్లు గవర్నమెంట్ సెక్టార్ లో కనీసం పదేండ్లు పని చేయాలని , లేకపోతే కోటి రూపాయలు ఫైన్ వేస్తామని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు యూపీ హెల్త్​ డిపార్ట్​మెంట్ ప్రిన్సి పల్ సెక్రటరీ అమిత్ మోహన్ ఒక ప్రకటన చేశారు. పదేళ్లకు ముందే గవర్నమెంటు జాబ్ ను వదిలేసినా, ఫైన్ తప్పదని స్పష్టం చేశారు. ఇలాంటి వారిని కోర్సు నుంచి మూడేళ్లపాటు డీబార్ చేస్తామని హెచ్చరించారు. యూపీలో గవర్నమెంటు ఆస్పత్రుల్లో, వైద్యసంస్థల్లో స్పెషలిస్ టు డాక్టర్ల కొరత తీవ్రంగా ఉండటంతో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 15 వేల స్పెషాలిటీ డాక్టర్ల పోస్టులు ఉండగా, వీటిలో 11 వేల పోస్టులను ఎంబీబీ ఎస్ డాక్టర్లతో భర్తీ చేశారు. ఎంబీబీ ఎస్ డాక్టర్లు ఏడాదిపాటు పల్లెటూర్లలో పనిచేస్తే నీట్ పీజీ ఎగ్జామ్
లో కన్సెషన్ ఇస్తామని కూడా యూపీ ప్రకటించింది. రెండేళ్ల సర్వీసు ఉంటే 20 పాయింట్లు , మూడేళ్లు ఉంటే 30 రిబేట్ పాయింట్లు ఇస్తామని ఆయన చెప్పారు.