పంట నష్టంపై వివరాలు పంపండి: వ్యవసాయ శాఖకు ప్రభుత్వం ఆదేశం

పంట నష్టంపై వివరాలు పంపండి: వ్యవసాయ శాఖకు ప్రభుత్వం ఆదేశం

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: పంట నష్టంపై సమగ్ర సర్వే చేసి వివరాలు ఇవ్వాలని వ్యవసాయ శాఖను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. గురువారం ప్రభుత్వ కార్యదర్శి రాహుల్ బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామాల వారీగా, సాగుదారుల (రైతులు, కౌలు రైతులు) వారీగా సర్వే చేపట్టి నష్టం వివరాలు పూర్తి గా పంపాలని పేర్కొన్నారు. పంట నష్టపోయిన రైతు లకు ఎకరాకు రూ.10 వేల చొప్పున ఇవ్వాలని కేసీ ఆర్ నిర్ణయించారని, అందులో భాగంగా ఈ నెల 17వ తేదీ నుంచి 21 వరకు కురిసిన వడగండ్ల వర్షాలతో నష్టపోయిన రైతులకు డిజాస్టార్ మేనేజ్‌‌‌‌మెంట్ నుంచి నిధులు ఇవ్వాలని సూచించారు. దీంతో వివరాలను సేకరించేందుకు అధికారులను రంగంలోకి దించింది. రెండు మూడు రోజుల్లో పూర్తి వివరాలను సేకరించాలని ఏఈవోలను ఆదేశించింది. క్లస్టర్ల వారీగా పంట నష్టం జరిగిన గ్రామాల్లో ఏ పంటలు, ఎంత సాగయ్యాయి? ఏ రకం పంట దెబ్బతిన్నది? వివరాలను ఏఈవోలు సేకరిస్తున్నారు. సేకరించిన వివరాలతోపాటు రైతుల పట్టాపాస్ బుక్‌‌‌‌లు, బ్యాంకు అకౌంట్‌‌‌‌ విరాలను ప్రత్యేక వెబ్‌‌‌‌ పోర్టల్‌‌‌‌లో అప్‌‌‌‌లోడ్‌‌‌‌ చేస్తారు. వీటిని మండల స్థాయి, జిల్లా స్థాయి వ్యవసాయశాఖ అధికారులు స్క్రూటినీ చేసి హైదరాబాద్‌‌‌‌లోని హెడ్‌‌‌‌ ఆఫీస్‌‌‌‌కు పంపిస్తారు. ఈ ప్రక్రియను నాలుగు రోజుల్లో పూర్తి చేసి.. ఎకరానికి రూ.10 వేల చొప్పున పరిహారం అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.