- ప్రతిపాదనను పరిశీలిస్తున్న కేంద్రం
న్యూఢిల్లీ: మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ (ఎంటిఎన్‌ఎల్) కార్యకలాపాలను ఒక ఒప్పందం ద్వారా బీఎస్‌ఎన్‌ఎల్‌కు అప్పగించే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. నెల రోజుల్లో దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎంటీఎన్ఎల్ను భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్)లో విలీనం మాత్రం చేయబోరని తెలుస్తోంది.
ఎంటీఎన్ఎల్కు భారీగా అప్పులు ఉండటమే ఇందుకు కారణం. నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ కొత్త ప్రతిపాదనను కార్యదర్శుల కమిటీ ముందు ఉంచి, ఆ తర్వాత క్యాబినెట్ ఆమోదం కోసం పంపుతారు. తగినన్ని నిధులు లేనందున బాండ్ హోల్డర్‌లకు వడ్డీ చెల్లించలేకపోతున్నామని ఎంటీఎన్ఎల్ఇటీవల ప్రకటించింది. ఎంటీఎన్ఎల్ ఢిల్లీ ముంబైలలో సేవలను అందిస్తే, బీఎస్ఎన్ఎల్ భారతదేశ కార్యకలాపాలను (ఢిల్లీ, ముంబై మినహా) నిర్వహిస్తుంది.