రైతులు వద్దన్నా భూమి సేకరించిన్రు

రైతులు వద్దన్నా భూమి సేకరించిన్రు

తెలంగాణలో మొత్తం ఎస్సీ, ఎస్టీ, బీసీల నుండి భూములు గుంజుకుంటున్నరని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మల గ్రామంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్  కోసం భూమి కోల్పోయిన బాధిత రైతులతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడారు. ఈ నేపథ్యంలో భూసేరణపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు వద్దంటున్నా.. వినకుండా వారి వద్ద నుంచి దాదాపు 370 ఎకరాల భూమి సేకరించారని ఆరోపించారు. 

పేద రైతులు కావడంతో బెదిరించి మరీ తీసుకున్నారని విమర్శించారు. అప్పుడు వారికి కేవలం రూ.5 లక్షలు మాత్రమే చెల్లించారని, పక్కనే ఉన్న  కామారెడ్డిలో రూ.10 లక్షలు చెల్లించారని చెప్పారు. ఇప్పుడు -ప్రభుత్వం సేకరించిన భూములు  ఫాంహౌస్ లుగా, రియల్ ఎస్టేట్ కంపనీలుగా మారిపోతాయని ప్రవీణ్ కుమార్ చెప్పారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో మొత్తం ఎస్సీ, ఎస్టీ, బీసీల నుండి భూములు గుంజు కుంటున్నరని వ్యాఖ్యానించారు. ప్రజలారా దోపిడీ ప్రభుత్వంను గద్దె దించాలి.. సిద్ధంగా ఉండండి అంటూ ఆయన చెప్పుకొచ్చారు