పాన్ కార్డు, ఓటర్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ లాంటివి ఎన్ని ఉన్నా.. ఒక వ్యక్తికి గుర్తింపు కార్డు ఏదంటే అది ఆధార్ కార్డు. ప్రభుత్వం అధికారికంగా అందించే ఈ బయోమెట్రిక్ కార్డు ఇండియాలో 134 కోట్ల ఎన్రోల్మెంట్స్ ఉన్న అతి ముఖ్యమైన గుర్తింపు కార్డు. ప్రతి పనికీ ఆధార్ కార్డు తప్పనిసరి అవ్వడంతో.. యూజర్లకు ఎల్లవేళలా అందుబాటులో ఉంచాలని కేంద్రం భావిస్తోంది. ఈ క్రమంలో ప్రతి స్మార్ట్ ఫోన్ లో ఆధార్ కార్డు యాప్ ఇన్బిల్టుగా ఉండేలా చూడాలని కంపెనీలను కేంద్రం ఆదేశించింది. అయితే కేంద్ర ఆదేశాలను యాపిల్, సామ్ సంగ్, గూగుల్ వంటి కంపెనీలు తిరస్కరించడం చర్చనీయాంశంగా మారింది.
ఇటీవలే సంచార్ సాథీ యాప్ ను ఇన్ బిల్ట్ గా రూపొందించాలన్న కేంద్ర విజ్ఞప్తిని తిరస్కరించాయి కంపెనీలు. మళ్లీ ఇప్పుడు ఆధార్ కార్డు విషయంలో కూడా అదే ధోరణిలో ఇన్ బిల్ట్ గా ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పాయి. రాయిటర్స్ రిపోర్టు ప్రకారం.. 2026 జనవరిలోనే ఈ ప్రతిపాదనను కేంద్రం కంపెనీల ముందుంచింది. ఇండియాలో అమ్మే ప్రతి స్మార్ట్ ఫోన్ బయోమెట్రిక్ ఐడెంటిటీతో ఉండటం.. యూజర్ కొత్త ఫోన్ తీసుకున్నపుడు ఆటోమేటిక్ గా ఆధార్ లింక్ అయ్యేలా ముందస్తుగానే యాప్ ను రూపొందించాల్సింగా కేంద్రం ప్రతిపాదన.
కంపెనీలు ఎందుకు తిరస్కరిస్తున్నాయి..?
మ్యానిఫ్యాక్చర్స్ అసోసిషయేన్ ఫర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (MAIT) ఈ ప్రతిపాదనను వ్యతిరేకించింది. అలా రూపొందిస్తే ప్రైవసీ, సేఫ్టీ ఇష్యూలు వస్తాయని సామ్ సంగ్, యాపిల్ చెబుతున్నాయి. సంచార్ సాథీ యాప్ ప్రతిపాదన సమయంలో కూడా ఇదే కారణాన్ని చెప్పాయి కంపెనీలు.
దీనికి తోడు ఆధార్ యాప్ ప్రీ–ఇన్స్టాల్ చేయాలంటే ప్రత్యేక ఉత్పత్తి ప్రక్రియ ద్వారా చేయాల్సి ఉంటుంది. అదే విధంగా ఎగుమతి విషయంలో లాజిస్టిక్ సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నట్లు MAIT చెబుతోంది.ఇది ప్రజలకు అంత ప్రయోజకరం కాదని జనవరి 13న కేంద్రానికి పంపిన ఈమెయిల్ లో పేర్కొంది.
ఫోన్లలో ఆధార్ యాప్ ఎందుకు ఉండాలంటుంది..?
ఆధార్ యాప్ ను 2026 జనవరి లో UIDAI చేసింది. దీని వలన యూజర్లు తమ వ్యక్తిగత వివరాలను అప్డేట్ చేసుకోవడం, ఫ్యామిలీ ప్రొఫైల్ మేనేజ్ చేసుకోవడం, డేటా మిస్ యూజ్ కాకుండా బయోమెట్రిక్ లాక్ చేయడం వంటి ఉపయోగాలు ఉన్నట్లు కేంద్రం చెబుతోంది. ప్రిఇన్ స్టాల్ చేయడం ద్వారా ఆధార్ ను ఉపయోగించుకునేందుకు వీలుంటుందని.. ప్రత్యేకంగా డౌన్ లోడ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదని కేంద్ర ప్రభుత్వ అభిప్రాయం.
12 అంకెలు ఉన్న ఆధార్ ఇప్పుడు ప్రతి దానికి అవసరమే. బ్యాంకు వెరిఫికేషన్, టెలికం, ఎయిర్ పోర్ట్.. ఇలా ప్రతిదానికి ఆధార్ మ్యాండేటరీ అయినపరిస్థితి ఉంది. అయితే రష్యా మినహా ప్రపంచంలో ఏ ఒక్క దేశం ప్రభుత్వ యాప్స్ ను ప్రి–ఇన్ స్టాల్ చేయడంలేదని కంపెనీలు వాదిస్తున్నాయి.
