గౌలిపురా స్లాటర్ హౌస్​ను తిరిగి ప్రారంభిస్తాం: జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్

గౌలిపురా స్లాటర్ హౌస్​ను తిరిగి ప్రారంభిస్తాం: జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్

హైదరాబాద్ సిటీ, వెలుగు: సంతోశ్​నగర్ పరిధిలోని గౌలిపురా మేకల మండీని త్వరలో తిరిగి ప్రారంభిస్తామని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ చెప్పారు. బుధవారం ఆయన స్లాటర్ హౌస్ బిల్డింగ్​ను పరిశీలించారు. కాలనీకి చెందిన ఓ వ్యక్తి కోర్టుకు వెళ్లడంతో స్లాటర్​హౌస్​బంద్​అయ్యిందని, గతంలో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో మంచిగా నడిచిందని తెలిపారు. బిల్డింగ్, మెషీన్లకు రిపేర్లు చేసి, తాగునీరు, ఇతర వసతులు కల్పించి త్వరలోనే  పునఃప్రారంభిస్తామన్నారు. ప్రాజెక్ట్ ఇంజనీర్ కు ప్రతిపాదనలు తయారుచేయాలని ఆదేశించారు. కమిషనర్ వెంట హెల్త్ అడిషనల్ కమిషనర్ పంకజ, జోనల్ కమిషనర్ వెంకన్న, జోనల్ ఎస్ఈ మహేశ్వర్ రెడ్డి, ప్రాజెక్టు ఎస్ఈ శ్రీలక్ష్మి, సంతోశ్​నగర్ డిప్యూటీ కమిషనర్ మంగతాయారు తదితరులు పాల్గొన్నారు.