నేటి నుంచే గ్రాడ్యుయేట్​ ఎమ్మెల్సీ నామినేషన్లు

నేటి నుంచే గ్రాడ్యుయేట్​ ఎమ్మెల్సీ నామినేషన్లు

24న స్క్రూటినీ.. 26న క్యాండిడేట్లు ఖరారు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రెండు గ్రాడ్యుయేట్​ఎమ్మెల్సీ ఎలక్షన్లకు మంగళవారం నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలుకానుంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్​ ప్రకారం.. మంగళవారం పొద్దున 11 గంటలకు రిటర్నింగ్​ఆఫీసర్లు ఎలక్షన్​నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఆ వెంటనే నామినేషన్లు తీసుకోవడం మొదలవుతుంది. ఈ మేరకు సీఈవో నుంచి మహబూబ్​నగర్– రంగారెడ్డి– హైదరాబాద్, నల్లగొండ– వరంగల్– ఖమ్మం గ్రాడ్యుయేట్​ నియోజకవర్గాలు ఉన్న జిల్లాల ఎన్నికల అధికారులకు ఆదేశాలు అందాయి. బ్యాలెట్​ పద్ధతిలో ఎన్నికలు జరుగుతాయని, పోటీలో ఉండే క్యాండిడేట్ల ఫోటోలు కూడా తీసుకోవాలని సీఈవో సూచించారు. జనరల్​ క్యాండిడేట్లు రూ.10 వేలు, ఎస్సీ, ఎస్టీలు రూ.5 వేలు సెక్యూరిటీ డిపాజిట్​చెల్లించాల్సి ఉంటుంది. నామినేషన్లు వేసేప్పుడు క్యాండిడేట్ తోపాటు మరో నలుగురిని మాత్రమే అనుమతిస్తామని స్పష్టం చేశారు. ఈ నెల 23న మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్లు తీసుకుంటారు. 24న స్ర్కూటినీ, 26న విత్​డ్రాకు చాన్స్​ ఉంటుంది. అదే రోజు సాయంత్రం బరిలో ఉండే క్యాండిడేట్లను ప్రకటిస్తారు. మార్చి 14న పోలింగ్, 17న ఓట్ల లెక్కింపు ఉండనుంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు క్యాండిడేట్లను ప్రకటించాయి. కాగా.. హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్​నగర్​ గ్రాడ్యుయేట్​ ఎమ్మెల్సీ ఎలక్షన్​పై జీహెచ్ఎంసీ కమిషనర్, ఎలక్షన్​ఆఫీసర్​ లోకేశ్​కుమార్​ సోమవారం సమీక్షించారు. 11 మంది నోడల్​ అధికారులకు బాధ్యతలు అప్పగించారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో వృద్ధులకు పోస్టల్​ బ్యాలెట్​

గ్రాడ్యుయేట్​ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోస్టల్​బ్యాలెట్​ఓటింగ్‌‌‌‌‌‌‌‌కు ఈసీ పర్మిషన్‌‌‌‌‌‌‌‌ ఇచ్చిది. మంగళవారం నుంచి 5 రోజులపాటు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పించింది. గ్రాడ్యుయేట్​ఓటర్ లిస్టులో పేరు ఉండి, ఓటు వేయడానికి వెళ్లలేని 80 ఏండ్ల వృద్ధులు, దివ్యాంగులు, కరోనా అనుమానిత, బాధిత ఓటర్లు పోస్టల్​బ్యాలెట్​ద్వారా ఓటు వేయచ్చన్నారు. బూత్​లెవెల్ ఆఫీసర్లు ఫారం–12డి ఇచ్చి పోస్టల్ బ్యాలెట్‌‌‌‌‌‌‌‌తో ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తారు.

For More News..

లెక్కల్లో గట్టెక్కేదెట్లా? టెన్త్ స్టూడెంట్లలో ఆందోళన

గ్రెటా థన్​బర్గ్  ‘టూల్ కిట్’ కేసు.. పరారీలో ఇద్దరు!

పాడి రైతులకు ఇన్సెంటివ్​ రావట్లే

ఎన్జీటీ వద్దన్నా.. ఏపీ సంగమేశ్వరం పనులు చేస్తోంది