
మెహిదీపట్నం వెలుగు : అన్వర్ ఉలూం కాలేజీ ఐదో స్నాతకోత్సవం వేడుకలు ఆదివారం న్యూ మల్లేపల్లిలోని కాలేజీ క్యాంపస్ లో ఘనంగా నిర్వహించారు. అన్వర్ ఉలూం కాలేజీ జాయింట్ సెక్రటరీ నవాబ్ మహబూబ్ అలంఖాన్ అధ్యక్షతన జరిగిన వేడుకలకు ముఖ్యఅతిథిగా ఉస్మానియా వర్సిటీ సైన్స్ విభాగం డీన్ కరుణసాగర్ హాజరై మాట్లాడారు.
విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు వెళ్లాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం విద్యార్థులకు పట్టాలను, గోల్డ్ మెడళ్లను అందజేశారు. కార్యక్రమంలో కాలేజీ డైరెక్టర్ అహమ్మద్ బేగ్, ప్రిన్సిపల్ మహమ్మద్ అబ్దుల్ రజాక్, ఎగ్జామినేషన్ కంట్రోలర్ ఎంఏ రజాక్, సిబ్బంది పాల్గొన్నారు.