ఆసిఫాబాద్, వెలుగు: రెండో విడత గ్రామ పంచాయతీలకు నామినేషన్ల స్వీకరణ ముగిసింది. పోటీలో పాల్గొనే అభ్యర్థులు మంగళవారం చివరిరోజు నామినేషన్లు వేసేందుకు భారీగా తరలివచ్చారు. కేంద్రాల వద్దకు సాయంత్రం 5 గంటల వరకు వచ్చిన అభ్యర్థులకు టోకెన్లు అందజేసిన ఎన్నికల అధికారులు రాత్రి వరకు నామినేషన్లు స్వీకరించారు. సర్పంచ్, వార్డు స్థానాలకు భారీగా నామినేషన్లు వచ్చాయి. జిల్లాల వారీగా వివరాలు ఇవీ..
ఆసిఫాబాద్ జిల్లా..
మండలం జీపీలు నామినేషన్ వార్డులు నామినేషన్లు
బెజ్జూర్ 22 149 188 488
చింతలమానెపల్లి 19 123 176 426
దహెగాం 24 145 200 465
కౌటల 20 117 182 482
పెంచికల్ పేట్ 12 92 102 237
సిర్పూర్ (టి) 16 111 144 330
మొత్తం 113 737 992 2428
మంచిర్యాల జిల్లా..
మండలం జీపీలు నామినేషన్లు వార్డులు నామినేషన్లు
బెల్లంపల్లి 17 13 156 432
భీమిని 12 87 100 241
కన్నెపల్లి 15 10 130 327
కాసిపేట్ 22 113 190 393
నెన్నె 19 124 158 373
తాండూర్ 15 115 144 411
వేమనపల్లి 14 84 118 277
మొత్తం 114 758 996 2454
ఆదిలాబాద్ జిల్లా..
మండలం జీపీలు నామినేషన్లు వార్డులు నామినేషన్లు
ఆదిలాబాద్ రూరల్ 31 147 258 558
మావల 03 28 28 87
బేల 31 139 254 528
జైనథ్ 17 123 144 322
సాత్నాల 1 77 130 239
భోరజ్ 17 125 138 284
తాంసి 14 89 112 222
భీంపూర్ 2 118 196 380
మొత్తం 156 846 1260 2620
నిర్మల్ జిల్లా..
మండలం జీపీలు నామినేషన్లు వార్డులు నామినేషన్లు
నిర్మల్ రూరల్ 20 102 170 381
సోన్ 14 74 132 276
సారంగపూర్ 32 176 282 533
దిలావర్ పూర్ 12 82 108 198
నర్సాపూర్(జి) 13 82 120 274
లోకేశ్వరం 25 142 224 375
కుంటాల 15 83 134 278
మొత్తం 131 741 1170 2315
