ఇంద్రవెల్లి, వెలుగు : ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ నాగోబా జాతర వైభవంగా కొనసాగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర నుంచి తరలివస్తున్న భక్తులతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోతున్నాయి. గురువారం భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో గంటల తరబడి క్యూలో నిల్చోవాల్సి వచ్చింది. భక్తులు నాగోబాను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.
