
హైదరాబాద్ సిటీ వెలుగు: బల్కంపేట మావురాల ఎల్లమ్మ తల్లి, జమదగ్ని మహర్షి పెండ్లి వేడుక మంగళవారం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం 11.51 గంటలకు అభిజిత్ లగ్నంలో ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛారణ మధ్య కల్యాణ క్రతువును జరిపించారు. ప్రభుత్వం తరఫున మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ పట్టువస్త్రాలు సమర్పించారు.
బీఆర్ఎస్ఎమ్మెల్యే తలసాని తలంబ్రాలు తీసుకొచ్చారు. రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు, శివసత్తులు భారీగా తరలివచ్చి.. అమ్మవారి పెండ్లి వేడుకను చూసి తరించారు. కల్యాణోత్సవం తర్వాత భక్తులకు అన్నదానం చేశారు. పలువురు ఫ్రీగా కల్లు పంపిణీ చేశారు.