గొప్ప నిర్ణయం: మా పిల్లల్ని సర్కార్ బడికే పంపుతం.. నిర్మల్ జిల్లా బాబాపూర్ గ్రామస్తులుఏకగ్రీవ తీర్మానం

గొప్ప నిర్ణయం:   మా పిల్లల్ని సర్కార్ బడికే పంపుతం.. నిర్మల్ జిల్లా బాబాపూర్ గ్రామస్తులుఏకగ్రీవ తీర్మానం

లక్ష్మణచాంద, వెలుగు: తమ పిల్లలను సర్కార్​ బడులకే పంపుతామని నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం బాబాపూర్ గ్రామ ప్రజలు నిర్ణయానికి వచ్చారు. శనివారం సర్పంచ్ పడిగెల లక్ష్మి, హెచ్​ఎం సుజాత ఆధ్వర్యంలో నిర్ణయించారు. గ్రామంలోకి ప్రైవేటు స్కూళ్ల బస్సులు రాకూడదని, ప్రభుత్వ బడులను బలోపేతం చేయాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు. 

ఈ సందర్భంగా సర్పంచ్​ మాట్లాడుతూ..  ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌‌‌‌‌‌‌‌ మీడియం, మధ్యాహ్న భోజనం, ఇతర మౌలిక వసతులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ప్రైవేటు స్కూళ్లకు పిల్లలను పంపి ఆర్థికంగా ఇబ్బందులు పడవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఉప్పల సురేశ్, మాజీ సర్పంచ్ తునికి నారాయణ, మాజీ ఎంపీపీ తునికి రాజేశ్వర్, గ్రామ కార్యదర్శి చందు, హెచ్​ఎంలు సుజాత, కిష్టయ్య 
పాల్గొన్నారు.