టెస్ట్ క్రికెట్ చరిత్రలో పసికూన బంగ్లాదేశ్ సరికొత్త చరిత్ర సృష్టించింది. టెస్ట్ క్రికెట్ హిస్టరీలోనే తొలిసారి పాకిస్థాన్‌పై బంగ్లాదేశ్ విజయం సాధించింది. 10 వికెట్ల తేడాతో వాళ్ల సొంత గడ్డపైనే పాకిస్థాన్‌ను చిత్తు చేసి చారిత్రాత్మక గెలుపు కైవసం చేసుకుంది. కాగా, పాకిస్థాన్, బంగ్లా మధ్య రెండు టెస్ట్ మ్యాచుల సిరీస్ జరుగుతోంది. రావల్పిండి స్టేడియంలో జరిగిన తొలి టెస్ట్ ఫస్ట్ ఇన్సింగ్స్‌లో 448 పరుగులు చేసి పాక్ ఇన్సింగ్ డిక్లేర్ చేయగా.. బంగ్లాదేశ్ 565 పరుగులు చేసి 117 పరుగుల లీడ్ సాధించింది.
ఫస్ట్ ఇన్నింగ్స్‌లో అద్భుతంగా ఆడిన పాక్ బ్యాటర్లు సెకండ్ ఇన్నింగ్స్‌లో చేతులెత్తేశారు. కేవలం 146 పరుగులకే ఆలౌట్ అయ్యారు. దీంతో 30 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా ఒక్క వికెట్ నష్టపోకుండా టార్గెట్ ఛేజ్ చేసింది. తద్వారా టెస్ట్ క్రికెట్ హిస్టరీలో పాక్ పై బంగ్లా తొలి విజయాన్ని నమోదు చేసింది. అంతేకాకుండా పాకిస్థాన్ గడ్డపై 10 వికెట్లతో తేడాతో టెస్ట్ మ్యాచ్ గెలిచిన జట్టుగా బంగ్లా మరో రికార్డ్ క్రియేట్ చేసింది.
ఇప్పటి వరకు పాక్, బంగ్లా 13 టెస్టుల్లో తలపడగా.. 12 మ్యాచుల్లో పాక్ విజయం సాధించగా.. ఒక మ్యా్చ్ డ్రా అయ్యింది. ఇక బంగ్లాదేశ్ విజయంలో కీలక పాత్ర పోషించిన స్టార్ బ్యాటర్ ముఫ్పికర్ రహీమ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 191 పరుగులు చేసి తృటిలో డబుల్ సెంచరీ మిస్ చేసుకున్నాడు రహీమ్. తాజా విజయంతో బంగ్లా సిరీస్‌లో 1-0 తేడాతో లీడ్‌లో ఉంది.