దేవుణ్ణి కలవాలంటే ఆహారం తీసుకోవద్దన్న మత గురువు.. 21మంది మృతి

దేవుణ్ణి కలవాలంటే ఆహారం తీసుకోవద్దన్న మత గురువు.. 21మంది మృతి

దేవుడు ఉన్నాడా లేదా? ఈ ప్రశ్నకు రెండు సమాధానాలు ఉంటాయి. ఆస్తికులు దేవుడు ఉన్నాడని నమ్ముతారు. ఈ ప్రపంచంలోని అన్ని జీవులలోనూ దేవుడున్నాడని, ప్రజలను కాపాడుతాడని వీళ్లు నమ్ముతూ ఉంటారు. కానీ నాస్తికులు అలా కాదు. ప్రపంచం దాని స్వంత శక్తితో నడుస్తుందని నమ్ముతారు. దీని వెనుక సైన్స్ ఉంది తప్ప దేవుడు కాదని వాదిస్తూ ఉంటారు. కానీ ఆస్తికుల కంటే నాస్తికులే ఎక్కువగా కనిపిస్తూ ఉండడం చూస్తూనే ఉంటారు. గుడి, చర్చి, మసీదు ఇలా ప్రతిచోటా తమ మతం ప్రకారం దేవుణ్ణి ఉన్నట్టు చాలా మంది నమ్ముతుంటారు. అలా దేవున్ని అడ్డుపెట్టుకుని ఓ వ్యక్తి 21 మందిని ఫూల్స్ చేసి హత్య చేశాడు. ఆశ్చర్యంతో పాటు అత్యంత భయాందోళనను కలిగించే ఈ ఘటన రీసెంట్ గా వెలుగులోకి వచ్చింది.

కెన్యాలోని పాల్ అనే ఒక మత నాయకుడు దేవుడిని కలిసే భాగ్యం కల్పిస్తానని 21 మందిని ఆకర్షించాడు. అలా వారు చాలా రోజులు ఆకలితో ఉన్నారు. ఆ తర్వాత వారంతా   చనిపోయారు. అనంతరం ఆ 21మంది మృతదేహాలను కెన్యాలోని మలిండిలోని అడవి నుండి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో పోస్టుమార్టం చేయగా అందరూ ఆకలితో చనిపోయారని తేలింది. అప్పుడే ఈ విన్యాసాలన్నీ ఓ మత గురువు చేశాడన్న రహస్యం బయటపడింది.

బ్రెయిన్‌వాష్‌...

పోలీసుల కథనం ప్రకారం పాల్‌ ఈ వ్యక్తులందరినీ బ్రెయిన్‌వాష్‌ చేశాడు. లోకంలో తమ పని అయిపోయిందని వారందర్నీ ఎంకరేజ్ చేశాడు. దేవున్ని కలవాలంటే ఆహారాన్ని తీసుకోకుండా ఉండాలని వారికి చెప్పారు. అప్పుడు వారంతా ఆ మత గురువు చెప్పినట్టే చేశారు. అలా వాళ్లు చాలా రోజులు అలా ఉండేసరికి ఆకలితో చనిపోయారు. అలా దొరికిన మృతదేహాల్లో చిన్నారుల మృతదేహాలు కూడా ఉండడం అత్యంత బాధాకరంగా తోస్తోంది. ఇప్పటి వరకు 21 మృతదేహాలు లభ్యం కాగా.. మతం పేరుతో పాల్ మరెంతో మందిని హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. మరిన్ని మృతదేహాల కోసం అడవుల్లో గాలిస్తున్నారు.