
ఐపీఎల్ 2026 మినీ వేలంపై ఆసక్తి నెలకొంది. ఫ్రాంచైజీలు ఎవర్ని రిలీజ్ చేస్తారో ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా గత సీజన్ లో ఘోర ప్రదర్శన చేసిన చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, కోల్ కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ లాంటి జట్లు చాలా మంది ప్లేయర్లను వేలంలోకి వదిలేయనుంది. 2026 ఐపీఎల్ కోసం ఐపీఎల్ లో ఎవరిని ఎక్కువ ఖర్చు చేసి ఫ్రాంచైజీలు కొంటారనే విషయంలో ఒక క్లారిటీ వచ్చింది. ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్ ఐపీఎల్ 2026 మినీ వేలంలో అత్యధిక పలికేఅవకాశాలు కనిపిస్తున్నాయి. వీటికి కారణాలు లేకపోలేదు.
గ్రీన్ బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ చేయగలడు. ఇలాంటి ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ జట్టులో ఉంటే ఏ జట్టు అయినా పటిష్టంగా మారుతుంది. ఈ ఆజానుభావుడుపై చాలా ఐపీఎల్ జట్లు కన్నేసినట్టు సమాచారం. గాయంతో 2025 ఐపీఎల్ కు దూరమైనా గ్రీన్ మళ్ళీ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు. తేన రీ ఎంట్రీలోనే ఏ ఆసీస్ ఆల్ రౌండర్ టాప్ ఫామ్ తో చెలరేగుతున్నాడు. వెస్టిండీస్ పై ఇటీవలే ముగిసిన ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో బ్యాటింగ్ లో గ్రీన్ దంచికొట్టాడు. వరుసగా 51, 56*, 11, 55*, 32 స్కోర్లు చేసి సత్తా చాటాడు. అంతేకాదు ఆదివారం (ఆగస్టు 10) సౌతాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో 13 బంతుల్లోనే 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 35 పరుగులు చేశాడు.
2022లో తన అంతర్జాతీయ టీ20 అరంగేట్రం చేసినప్పటి నుండి గ్రీన్ నిలకడగా రాణిస్తున్నాడు. ఇప్పటివరకు 18 మ్యాచ్‌ల్లో 468 పరుగులు చేశాడు. వీటిలో 6 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టీ20 ఫార్మాట్ లో 60 మ్యాచ్‌ల్లో 1281 పరుగులు సాధించాడు. 2023లో గ్రీన్ ముంబై జట్టు తరపున ఆడాడు. 2022 ఐపీఎల్ వేలంలో 17.5 కోట్ల రికార్డ్ ధరకు గ్రీన్ ను ముంబై ఇండియన్స్ దక్కించుకుంది.ట్రేడింగ్ ద్వారా ముంబై నుండి ఈ ఆసీస్ ఆల్ రౌండర్ ను ఆర్సీబీ దక్కించుకుంది. ఈ క్రమంలో ముంబై జట్టుకు బెంగళూరు 17.50 కోట్లు చెల్లించింది. తన తొలి ఐపీఎల్ సీజన్‌లోనే గ్రీన్ 16 మ్యాచ్ ల్లో 452 పరుగులు చేసి 6 వికెట్లు పడగొట్టడం విశేషం.