
సికింద్రాబాద్, వెలుగు: అల్వాల్లో రాష్ట్ర సర్కారు నిర్మించ నున్న టిమ్స్ హాస్పిటల్ బిల్డింగ్ నిర్మాణానికి సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు అనుమతి ఇచ్చింది. 28 ఎకరాల్లో 1200ల పడకలతో 8 అంతస్తుల్లో నిర్మించనున్న భవనానికి అనుమతి మంజూరు చేయాల్సిందిగా కంటోన్మెంట్ బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తు చేసింది. కాగా ఇందుకు ఆమోదం తెలుపుతున్నట్లు గురువారం జరిగిన కంటోన్మెంట్ బోర్డు సాధారణ మీటింగ్ లో బోర్డు అధ్యక్షుడు బ్రిగేడియర్సోమశంకర్, సీఈవో మధుకర్నాయక్, నామినేటెడ్సభ్యుడు రామకృష్ణ వెల్లడించారు. ఈ సమావేశానికి ప్రభుత్వ అధికారులు హాజరై టిమ్స్ఆస్పత్రి భవనం గురించి వివరించారు. రెండేళ్లలో ఆస్పత్రిని ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి కంటోన్మెంట్బోర్డు రూ.320 కోట్ల అంచనా వ్యయంతో బడ్జెట్ను రూపొందించగా ఆమోదం తెలిపారు. గతేడాదితో పోలిస్తే ఈసారి రూ.100 కోట్లు అధికంగా కేటాయించారు.