బాసర ట్రిపుల్​ఐటీకి గ్రీన్ వర్సిటీ అవార్డు

బాసర ట్రిపుల్​ఐటీకి గ్రీన్ వర్సిటీ అవార్డు

హైదరాబాద్, వెలుగు :  బాసర ట్రిపుల్ ఐటీ (ఆర్జీయూకేటీ) ప్రతిష్టాత్మక కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్(కాప్) 28 గ్రీన్ యూనివర్సిటీ–2023 అవార్డుకు ఎంపికైంది. వర్సిటీలో పార్కుల ఏర్పాటు, భారీగా చెట్లు పెంచడంతో గ్రీన్ యూనివర్సిటీ అవార్డుకు ఆర్జీయూకేటీని అవార్డుల జ్యూరీ కమిటీ ఎంపిక చేసింది.

ఈ విషయాన్ని ఆర్జీయూకేటీ వీసీ ప్రొఫెసర్ వెంకటరమణ వెల్లడించారు. డిసెంబర్1న దుబాయ్​లోని ఎక్స్ పో సిటీలో ఈ అవార్డును అందించనున్నారని పేర్కొన్నారు. ఇటీవలే కాప్28 నుంచి ఆహ్వానం అందిందని ఆయన చెప్పారు. ఈ అవార్డు రావడానికి కృషి చేసిన వర్సిటీ సిబ్బందిని, విద్యార్థులను  అభినందించారు.