జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫిర్యాదుల కోసం గ్రీవెన్స్ రిడ్రెసల్ సెంటర్ ఏర్పాటు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫిర్యాదుల కోసం గ్రీవెన్స్ రిడ్రెసల్ సెంటర్ ఏర్పాటు

హైదరాబాద్ సిటీ, వెలుగు: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల నేపథ్యంలో ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారం కోసం జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులో  1950 హెల్ప్​లైన్ తో నేషనల్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టం కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఓటర్ల జాబితా, పోలింగ్ సెంటర్లు, ఎపిక్ కార్డులు, మోడల్ కోడ్ ఉల్లంఘనలు, ప్రలోభాల అంశాలు తదితర వాటికి సంబంధించిన సమాచారంతో ప్రజలు ఫిర్యాదులు  చేయవచ్చు. ఈ హెల్ప్‌‌లైన్ కు ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి  433 కాల్స్ రాగా, ఇందులో 379 కాల్స్ కు సమాధానం ఇచ్చినట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.