గృహలక్ష్మి ఎంపిక ప్రాసెస్ స్పీడప్

గృహలక్ష్మి ఎంపిక ప్రాసెస్ స్పీడప్

హైదరాబాద్, వెలుగు: గృహలక్ష్మి స్కీమ్ లబ్ధిదారుల ఇండ్ల మంజూరు ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఈ నెలాఖరు కల్లా లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసి సాంక్షన్ లెటర్లు ఇవ్వాలని కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సోమవారం దాకా నల్గొండ, సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల్లో 2వేల మందిని స్కీమ్​కు ఎంపిక చేశామని హౌసింగ్ అధికారులు చెబుతున్నారు.

సాంక్షన్ చేస్తున్న వివరాలను కూడా ఆన్ లైన్ లో అప్ లోడ్ చేస్తున్నారు. అర్హుల జాబితాను కలెక్టర్ ఫైనల్ చేసి మండల అధికారులకు వివరాలు పంపుతారు. వాళ్లు మళ్లీ క్రాస్ చెక్ చేసి స్కీమ్ సాంక్షన్ చేస్తారు. త్వరలో నియోజకవర్గాల వారీగా మహిళలకు ఎమ్మెల్యేలు ప్రొసీడింగ్ కాపీలను అందజేయనున్నట్లు తెలుస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా 15.20 లక్షల అప్లికేషన్లు రాగా.. ఇందులో 11.40 (75 శాతం) లక్షల మందిని అర్హులుగా తేల్చినట్లు సమాచారం.