కామారెడ్డిలో కిరాణా దుకాణాలు పూర్తిగా బంద్

కామారెడ్డిలో కిరాణా దుకాణాలు పూర్తిగా బంద్
  • వ్యాపారుల స్వచ్ఛంద లాక్ డౌన్
  • రేపటి నుంచి ఆదివారం వరకు సెల్ఫ్ లాక్డౌన్

కామారెడ్డి జిల్లా: రేపటి నుంచి ఆదివారం వరకు జిల్లా కేంద్రంలో కిరాణా దుకాణాలు పూర్తిగా మూతపడనున్నాయి. ఇద్దరు కిరాణా వర్తక వ్యాపారులు కరోనాతో మృతి చెందడంతో వ్యాపార సంఘాల నాయకులు  అత్యవసరంగా సమావేశమై సంచలన నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా లాక్డౌన్ ఉన్నా ఉదయం 6 నుంచి 10 వరకు అనుమతి ఉంటుంది. అయితే కామారెడ్డి జిల్లా కేంద్రంలో మాత్రం పూర్తిగా మూసివేత అమలు చేయాలని వ్యాపారులు నిర్ణయించారు. ఎందుకంటే సోషల్ డిస్టెన్స్ పాటించమని.. కరోనా నిబంధనలు పాటించమని ఎంత మొత్తుకుంటున్నా ప్రజలు విచ్చలవిడిగా తిరగడమే బంద్ నిర్ణయానికి కారణమని వ్యాపార సంఘాల నాయకులు చెబుతున్నారు. ఇప్పటికే ఇద్దరు వ్యాపారులు చనిపోయినా ప్రజల్లో మార్పు కనిపించడం లేదని.. అందుకే కఠిన నిర్ణయాన్ని స్వచ్చందంగా తీసుకుంటున్నట్లు ప్రకటించారు. వచ్చే ఆదివారం మళ్లీ సమావేశమై బంద్ పై నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నారు.