వైరల్: కెమెరామెన్ ఓవరాక్షన్‌‌కు వరుడి సూపర్ రియాక్షన్

వైరల్: కెమెరామెన్ ఓవరాక్షన్‌‌కు వరుడి సూపర్ రియాక్షన్

ఇళ్లల్లో ఏ వేడుకలు జరిగినా కెమెరా క్లిక్‌‌మనాల్సిందే. కెమెరాలు, ఫోన్లు అంటూ డివైజ్‌‌లు మారినా ఫొటోలు తీసుకొని వాటిని భద్రపర్చుకోవడం చాలా మందికి అలవాటు. ముఖ్యంగా పెళ్లిళ్లలో ఫొటోలు, వీడియోలకు భలే క్రేజ్ ఉంటుంది. స్టయిల్‌‌గా ఫొటోలు దిగి ఆల్బమ్స్ చేయించుకొని అప్పుడప్పుడు వాటిని తిప్పేస్తూ జ్ఞాపకాలను నెమరువేసుకోవడం చాలా మందికి అలవాటు. ఇక పెళ్లి టైమ్‌‌లో వెరైటీ ఫోజులు ఇమ్మంటూ వధూవరులను కెమెరామెన్‌‌లు సతాయించడం కామెడీగా ఉంటుంది. అలాంటి ఓ వీడియో ఇప్పుడు నెట్‌‌లో వైరల్ అవుతోంది. ఒక పెళ్లి వేడుకలో ఫొటోగ్రాఫర్ కాస్త అతి చేసి పెళ్లికొడుకు చేతిలో భంగపడ్డాడు. పెళ్లి కూతురు ఫొటో తీసే సమయంలో ఫోజులు ఇమ్మంటూ కెమెరామెన్ అతి చేయడంతో వరుడు అతడ్ని కొట్టాడు. వరుడి రియాక్షన్ చూసి వధువు పగలబడి నవ్వుకుంది. ఈ సరదా వీడియో నెట్‌‌లో హల్‌చల్ చేస్తోంది. ఇంకెందుకు ఆలస్యం, మీరూ ఈ వీడియోను చూసి నవ్వుకోండి మరి..!!