
క్రికెట్ మ్యాచ్ కు ముందు ఊహించని సీన్ ఒకటి చోటు చేసుకుంది. ఐసీసీ వరల్డ్ కప్ లీగ్ 2లో శుక్రవారం (ఆగస్టు 29) స్కాట్లాండ్, నమీబియా మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. కెనడాలో సిటీలోని ఒంటారియోలోని కింగ్ సిటీ వేదికగా మాపుల్ లీఫ్ నార్త్-వెస్ట్ గ్రౌండ్‌లో జరగాల్సిన ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు వర్షం అంతరాయం ఏర్పడింది. సాధారణంగా వర్షం పడితే మ్యాచ్ జరపడానికి గ్రౌండ్ స్టాఫ్ తెగ కష్టపడుతుంటారు. ఎప్పటికప్పుడూ వర్షం పడిన నీళ్లను తొలగించి గ్రౌండ్ సిద్ధం చేసే పనిలో ఉంటారు.
ఈ మ్యాచ్ కు ముందు ఒక విచిత్ర సీన్ అందరికీ షాకిస్తుంది. గ్రౌండ్ ఇంతకు ఆరకపోవడంతో వర్షం తర్వాత గ్రౌండ్ స్టాఫ్ వింత వ్యూహాలను అనుసరించారు. అప్పటికే భారీ వర్షంతో మ్యాచ్ ప్రారంభానికి ఆలస్యం అయింది. పలుమార్లు గ్రౌండ్ ను చెక్ చేసినా పిచ్ ఆరకపోవడంతో గ్రౌండ్ స్టాఫ్ ఏకంగా పిచ్‌కు నిప్పంటించారు. ఈ సీన్స్ అన్ని కెమారాలో రికార్డ్ అయ్యాయి. పిచ్ కు నిప్పంటించిన ఫోటోస్ ను స్కాట్లాండ్ క్రికెట్ బోర్డు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ గా మారాయి.
మ్యాచ్ కట్ ఆఫ్ సమయం రాత్రి 9:02 గంటలకు కూడా గ్రౌండ్ సిద్ధం కాకపోవడంతో మ్యాచ్ రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. 2027 వన్డే ప్రపంచ కప్ సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయక్తంగా ఆతిధ్యమివ్వనున్నాయి. నమీబియా 2027 ప్రపంచ కప్‌ను నిర్వహిస్తున్నా ఐసీసీ పూర్తి సభ్య దేశం కాకపోవడంతో ఈ మెగా టోర్నీకి అర్హత సాధించాలంటే క్వాలిఫయర్ మ్యాచ్ లు ఆడాల్సిందే. కెనడా, నమీబియా జట్ల మధ్య గతంలో జరిగిన మ్యాచ్ గమనిస్తే కెనడాను నమీబియా ఐదు వికెట్ల తేడాతో ఓడించింది
Game off ☹️
— Cricket Scotland (@CricketScotland) August 29, 2025
A frustrating day in Toronto. We try again on Sunday against the hosts 🏴#FollowScotland pic.twitter.com/g69mugExDC