సినీ ప్రపంచంలో ఎప్పుడు ఏ వార్త వైరల్ అవుతుందో చెప్పలేం. ముఖ్యంగా సెలబ్రిటీల వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవాలని అభిమానులు ఆసక్తి చూపుతుంటారు. వారిపై వచ్చే రూమర్స్ నెట్టింట సెన్సేషన్ సృష్టిస్తుంటాయి. ఈనేపథ్యంలోనే గత కొన్ని రోజులుగా సినీ ఇండస్ట్రీలో ఒక వార్త తెగ హల్చల్ చేస్తోంది. అదే.. మృణాల్ ఠాకూర్ , తమిళ స్టార్ హీరో ధనుష్ వివాహం. ఈ జంట త్వరలోనే ఏడడుగులు వేయబోతున్నారంటూ వస్తున్న వార్తలపై లేటెస్ట్ గా ఒక స్పష్టత వచ్చింది.
ఫిబ్రవరి 14న పెళ్లి రూమర్స్?
గత కొద్ది రోజులుగా మృణాల్ ఠాకూర్, ధనుష్ ప్రేమలో ఉన్నారని, వచ్చే నెల ఫిబ్రవరి 14న అంటే 'వాలెంటైన్స్ డే' రోజున వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనేది వార్తలు వస్తున్నాయి.. 2025 ఆగస్టులో 'సన్ ఆఫ్ సర్దార్ 2' ప్రీమియర్ షోలో వీరిద్దరూ ఆత్మీయంగా పలకరించుకోవడంతో ఈ ఊహాగానాలు మొదలైయ్యాయి. ఇటీవల ధనుష్ సినిమా 'తేరే ఇష్క్ మే' షూటింగ్ ముగింపు పార్టీలో మృణాల్ కనిపించడంతో మరింత ముదిరాయి.
నిజం ఏంటి?
ఈ పెళ్లి కథనాలపై మృణాల్ ఠాకూర్ సన్నిహిత వర్గాలు తీవ్రంగా స్పందించాయి. ఈ వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదు. మృణాల్ ప్రస్తుతం తన కెరీర్‌పై పూర్తి దృష్టి పెట్టింది. ఫిబ్రవరిలో ఆమె నటించిన ఒక సినిమా విడుదల కాబోతోంది, అలాగే మార్చిలో మరో తెలుగు సినిమా షూటింగ్‌లో పాల్గొనాల్సి ఉంది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆమె, ఇప్పుడు పెళ్లి గురించి ఆలోచించే అవకాశం లేదు అని స్పష్టం చేశారు. కేవలం నిరాధారమైన ప్రచారమని ఈ వార్తలను కొట్టిపారేశారు.
మృణాల్ స్టైలిష్ కౌంటర్..
తనపై వస్తున్న రూమర్లను మృణాల్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చింది. ఈ వివాదాల మధ్య ఆమె సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేసింది. సముద్రం మధ్యలో బోటులో విహరిస్తూ, సూర్యాస్తమయాన్ని ఆస్వాదిస్తున్న వీడియోను పోస్ట్ చేస్తూ.. “Grounded, glowing and unshaken!” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. అంటే, బయట ఎన్ని రూమర్స్ వచ్చినా తన ప్రశాంతతను అవి చెడగొట్టలేవని ఆమె పరోక్షంగా చెప్పకనే చెప్పింది. అంతేకాకుండా, శనివారం రాత్రి రమేష్ తౌరానీ బర్త్‌డే పార్టీలో కూడా ఆమె ఎంతో ఉత్సాహంగా పాల్గొని కెమెరా కళ్లకు చిక్కింది.
సినిమాల విషయానికొస్తే..
ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ తెలుగు, హిందీ భాషల్లో క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉంది. 'సీతారామం', 'హాయ్ నాన్న' వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న ఈ బ్యూటీ, రాబోయే చిత్రాలతో తన సత్తా చాటాలని చూస్తోంది. అటు ధనుష్ కూడా తన స్వీయ దర్శకత్వంలో వస్తున్న చిత్రాలతో పాటు బాలీవుడ్ ప్రాజెక్టులతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు.
