గ్రూప్ 1, ఏఈ.. పరీక్ష తేదీని ప్రకటించిన టీఎస్పీఎస్సీ

గ్రూప్ 1, ఏఈ.. పరీక్ష తేదీని ప్రకటించిన టీఎస్పీఎస్సీ

మార్చి 5న నిర్వహించిన టీఎస్పీఎస్సీ అసిస్టెంట్ ఇంజనీర్స్ క్వశ్చన్ పేపర్ లీక్ అయిన నేపథ్యంలో టీఎస్పీఎస్సీ.. తాజా రిక్రూట్మెంట్ కోసం ప్రశ్నా పత్రాన్ని సిద్ధం చేస్తోంది. ఏప్రిల్ 4,2023న ఏఈ పరీక్షను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఏఈ విభాగంలో హార్టీ కల్చర్ డిపార్ట్ మెంట్ లో 22 పోస్టులో, అసిస్టెంట్ మోటర్ వెహికల్ ఇన్ ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్ మెంట్ లో 113 పోస్టులు భర్తీకి పరీక్షను నిర్వహించనున్నారు.  సబ్జెక్ట్ నిపుణులతో తాజా క్వశ్చన్ పేపర్ ను ప్రిపేర్ చేయిస్తున్నారు. అయితే, ఇప్పుడు ప్రకటించిన తేదీ కన్ఫార్మ్ కాదని, కాకపోతే అభ్యర్థులు సిద్ధంగా ఉండాలని టీఎస్పీఎస్సీ తెలిపింది.

మార్చి 12న జరగాల్సిన టౌన్‌ ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఓవర్‌సీర్‌ మునిసిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ విభాగంలోని 175 ఖాళీలకు, వెటర్నరీ, పశుసంవర్ధక శాఖలో వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ 185 ఖాళీల పరీక్షలు మార్చి 15, 16 తేదీల్లో జరగాల్సిన ఉండగా పేపర్ లీక్ కారణంగా ఇప్పటికే వాటిని  వాయిదా వేసింది. 

గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షను జూన్ 5 నుంచి 12 వరకు పరీక్షలు నిర్వహించే అవకాశం ఉందని టీఎస్పీఎస్సీ తెలిపింది. కాకపోతే ఈ పరీక్ష కోసం ఇప్పటివరకు క్వశ్చన్ పేపర్ ని సిద్ధం చేయలేదు. గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష ద్వారా మొత్తం 23,050 మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు.