
గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షా తేదీలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఖరారు చేసింది. జూన్ 5 నుంచి 12వ తేదీ మధ్య ఎగ్జామ్స్ నిర్వహించాలని నిర్ణయించింది. మెయిన్స్ పరీక్షను ఇంగ్లీష్, తెలుగుతో పాటు ఉర్దూలో నిర్వహించనున్నారు. క్వాలిఫైయింగ్ పేపర్ అయిన జనరల్ ఇంగ్లీష్ లో ప్రశ్నలు పదో తరగతి స్థాయిలో ఉంటుందని ప్రకటించింది. ఇంగ్లీష్ పరీక్షలో వచ్చే మార్కులను ర్యాంకుల ఖరారులో పరగణలోకి తీసుకోమని టీఎస్పీఎస్సీ స్పష్టం చేసింది. మెయిన్ పరీక్షలను ఉదయం10 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు నిర్వహిస్తారు.
పరీక్షల షెడ్యూల్
తేదీ సబ్జెక్ట్
05/06/12 జనరల్ ఇంగ్లీష్
06/06/12 జనరల్ ఎస్సే
07/06/12 హిస్టరీ, కల్చర్, జాగ్రఫీ
08/06/12 ఇండియన్ సొసైటీ, కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్
09/06/12 ఎకానమీ అండ్ డెవలప్మెంట్
10/06/12 సైన్స్ అండ్ టెక్నాలజీ, డేటా ఇంటప్రిటేషన్
12/06/12 తెలంగాణ మూవ్మెంట్అండ్ స్టేట్ ఫార్మేషన్