ముగిసిన గ్రూప్ 4 దరఖాస్తు గడువు

ముగిసిన గ్రూప్ 4 దరఖాస్తు గడువు

గ్రూప్ 4 దరఖాస్తు గడువు నేటితో ముగిసింది. ఇప్పటివరకు గ్రూప్ 4కి మొత్తం 9 లక్షల 51వేల 321 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు టీఎస్‭పీఎస్సీ అధికారులు తెలిపారు. ఇక జూలై 1న గ్రూప్ 4 పరీక్ష నిర్వహించనున్నారు. ఆ రోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్ 1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్ 2 పరీక్షఉండ‌నుంది. రెండు పేపర్లలోనూ 150 చొప్పున ప్రశ్నలు ఉండనున్నాయి. ప్రతి ప్రశ్నకు ఒక్కో మార్కు చొప్పున రెండు పేపర్లూ కలిపి 300 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఆబ్జెక్టివ్‌ పద్ధతిలో నిర్వహించే పరీక్ష ఓఎంఆర్‌ బేస్డ్‌గా ఉంటుంది. ఈ పరీక్షను ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ మాధ్యమాల్లో నిర్వహించనున్నట్లు టీఎస్ పీఎస్సీ అధికారులు పేర్కొన్నారు. గ్రూప్‌–4 కేటగిరీలో మొత్తం 8,180 ఉద్యోగాలను భ‌ర్తీ చేయ‌నున్నారు.