మళ్లీ ఓపెన్ కానీ TSPSC ఆన్ లైన్ పోర్టల్..

మళ్లీ ఓపెన్ కానీ TSPSC ఆన్ లైన్ పోర్టల్..

గ్రూప్ 4 ఆన్లైన్ అప్లికేషన్ పోర్టల్ ఓపెన్ కాకపోవడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఇవాళ్టి నుంచి గ్రూప్ 4కి అప్లై చేసుకోవాలని టీఎస్పీఎస్సీ తెలిపింది. అయితే ఉదయం నుంచి ఆన్లైన్ పోర్టల్ ఓపెన్ కాకపోవడంతో నెట్ సెంటర్ల ముందు అభ్యర్థులు పడిగాపులు కాస్తున్నారు. డిసెంబర్ 1న గ్రూప్ 4 నోటిఫికేషన్ విడుదలవగా.. 23 నుంచి దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని అధికారులు మొదట తెలిపారు. 

డిసెంబర్ 23న పోర్టల్ ఓపెన్ కాకపోవడంతో డిసెంబర్ 30 నుంచి జనవరి 19 వరకు దరఖాస్తు చేసుకోవాలని టీఎస్పీఎస్సీ సూచించింది. ఇవాళ ఉదయం నుంచి పోర్టల్ ఓపెన్ కాకపోవడంతో అధికారులపై అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగాల భర్తీ విషయంలో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా అని మండిపడుతున్నారు.