ఖమ్మంలో TRS నేతల మధ్య గ్రూపు రాజకీయాలు

ఖమ్మంలో TRS నేతల మధ్య గ్రూపు రాజకీయాలు

ఖమ్మం జిల్లా పాలేరు, ఖమ్మం నియోజకవర్గాల్లోని టీఆర్ఎస్ లో గ్రూప్ రాజకీయాలు మరింత పెరుగుతున్నాయి. పాలేరు నియోజక వర్గం తో పాటు జిల్లాలో పట్టున్న మాజీ మంత్రి తుమ్మల, కాంగ్రెస్ నుంచి గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచి TRS  లో చేరిన ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి కి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటోంది. టిడిపి నుంచి 2014 లో తెరాస లో చేరిన తుమ్మల గత టర్మ్ లో మంత్రి గ జిల్లాలో చక్రం తిప్పారు. కానీ ఇప్పుడు ఎమ్మెల్యే తో పడక పోవడంతో పార్టీ వ్యవహారాలకు దూరంగా వుంటున్నారు. 2018 ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ సత్తా చాటింది. ఉన్నట్లుండి జిల్లాలో ఇతర పార్టీల నుంచి గెలుపొందిన వాళ్లంత టిఆర్ఎస్ లో చేరారు. దీంతో తుమ్మలకు నియోజక వర్గ ఇంచార్జ్ పదవి కూడా పోయినట్లైంది. 

 పాలేరు నియోజకవర్గంలో తుమ్మల, కందాల రెండు గ్రూపులుగా విడిపోయారు టీఆర్ఎస్ నేతలు. ఒకరిపై మరొకరు కేసులు పెట్టుకుంటున్నారు.అక్రమ కేసులతో తమను వేధిస్తున్నారని ఆరోపిస్తున్నారు తమ్ముల వర్గీయులు.మరోవైపు సోషల్ మీడియా వేదికగా కందాల వర్గం నేతలు పలు పోస్టింగులు పెడుతున్నారు. పాలేరు నియోజక వర్గంలోని  పోలీస్ స్టేషలన్నీ కందాల క్యాంపు కార్యాలయం నుంచి ఆపరేట్ అవుతున్నాయని తుమ్మల వర్గం ఆరోపిస్తోంది. కందాల అల్లుడు రేవంత్ రెడ్డి దగ్గర ఉంటారని , కందాల కూడా రేవంత్ తో టచ్ లో ఉన్నారని చెబుతున్నారు. తుమ్మల వర్గం నేతలను పెయిడ్ ఆర్డిస్టులని విమర్శిస్తోంది కందాళ వర్గం

ఖమ్మం జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మాజీ ఎంపీ  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి మధ్య  విభేదాలు కొనసాగుతున్నాయి.తమ వర్గీయులపై అక్రమ కేసులు పెడుతున్నారని శ్రీనివాస్ రెడ్డి గతంలో ఆరోపించారు.ఈయనకు జిల్లా స్థాయిలో మంచి ఫాలోయింగ్ ఉంది.  మంచి అవకాశం కోసం శ్రీనివాస్ రెడ్డి ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. నేతల మధ్య గ్రూపు రాజకీయాలతో అధికార పార్టీ క్యాడర్ ఆందోళన చెందుతోంది.