
హైదరాబాద్, వెలుగు: ‘‘మేం చచ్చిపోతాం.దయచేసి అనుమతివ్వండి. మూడేళ్లుగా నరకం చూస్తున్నాం. ఈ మానసిక క్షోభను అనుభవించడం ఇక మా వల్ల కా దు’’ అంటూ 3 వేల మంది గ్రూప్–2 ఉత్తీర్ణులు శుక్రవారం మానవ హక్కుల మిషన్(హెచ్ఆర్సీ)ని ఆశ్రయించారు. పరీక్షలో పాసయ్యాం.. కచ్చితంగా జా బ్ వస్తుందనే నమ్మకంతో ఇన్నాళ్లు ఎదురుచూశామని చెప్పారు.‘‘టీఎస్ పీఎస్సీ తీరు వల్ల మాలో విశ్వాసం సన్నగిల్లేలా చేసింది. చస్తూ బతుకుతున్నాం. ఐదు నిమిషాల్లో క్లి యరయ్యే సమస్యను ఎందుకింత ఆలస్యం చేస్తున్నారో అర్థం కా వడం లేదు. పరీక్షలో రూ ల్స్ సరిగా తెలియక కొంతమంది అభ్యర్థులు తప్పులు చేశారు. టీఎస్ పీఎస్సీ వాటిని పరిగణలోకి తీసుకోవడం వల్ల సమస్య పెద్దదైంది.దీనిపై సర్వీస్ కమిషన్ ముందు ధర్నాలు చేశాం.ఎవరూ పట్టిం చుకోలేదు. ప్రగతి భవన్ ను ముట్టడించాం. గవర్నర్ నరసింహన్ ను కలిశాం.న్యాయం జరగలేదు. 2015లో గ్రూప్–2నోటిఫికేషన్ వస్తే, 2016 నవంబర్ 11, 13తేదీల్లో ఎగ్జామ్స్ రాశాం. ఉద్యోగం వస్తుందని ఎదురుచూస్తూ విలువైన మూడేళ్ల మయాన్నివృథా చేసుకున్నాం. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉండాల్సిన టైంలో తలకుమించిన భారమై కూర్చున్నాం” అంటూ ఆవేదన చెందారు.
పెండిం గ్ లో కేసు
గ్రూప్–2లో తప్పులపై పలువురు అభ్యర్థులు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ఇంకా పెండింగ్ లోనే ఉంది. కేసు విచారణను త్వరగా పూర్తయ్యేటట్లు ప్రయత్నిం చాల్సిన టీఎస్ పీఎస్సీ ని ర్లక్ష్యం వహిస్తోందని ఉత్తీర్ణత సాధిం చిన అభ్యర్థులుఆరోపించారు. ఈ విషయంలో హెచ్ఆర్సీ కలు గజేసుకుని తమకు న్యాయం చేయాలన్నారు.సామూహిక ఆత్మహత్యలకు అనుమతి ఇవ్వాలని అర్థించారు.