కీలక రంగాల వృద్ధి 13 నెలల గరిష్ఠానికి..

కీలక రంగాల వృద్ధి 13 నెలల గరిష్ఠానికి..

న్యూఢిల్లీ: బొగ్గు, ఉక్కు, సిమెంట్ ఉత్పత్తి పెరగడంతో భారతదేశం ఎనిమిది కీలక మౌలిక రంగాల వృద్ధి ఈ ఏడాది ఆగస్టులో 13 నెలల గరిష్ట స్థాయి అయిన 6.3 శాతానికి పెరిగిందని సోమవారం ప్రభుత్వం తెలిపింది. గత జులై నెలలో ఈ రంగాల వృద్ధి 3.7 శాతంగా ఉంది. గత ఏడాది ఆగస్టులో ఇది -1.5 శాతంగా ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు ఈ ఎనిమిది మౌలిక రంగాలు 2.8 శాతం వృద్ధిని నమోదు చేశాయి.