జీఎస్​టీ రివార్డు స్కీమ్​ మేరా బిల్​ మేరా అధికార్.. సెప్టెంబర్​1 నుంచి 6 రాష్ట్రాలలో అమలు

జీఎస్​టీ రివార్డు స్కీమ్​  మేరా బిల్​ మేరా అధికార్.. సెప్టెంబర్​1 నుంచి 6 రాష్ట్రాలలో అమలు
  • రూ. 10 వేల నుంచి రూ.  కోటి దాకా క్యాష్​ ప్రైజు

న్యూఢిల్లీ: మేరా బిల్​ మేరా అధికార్​ పేరిట జీఎస్​టీ ఇన్వాయిస్​ ఇన్సెంటివ్​ స్కీమును సెప్టెంబర్​ 1 నుంచి ఆరు రాష్ట్రాలలో ప్రభుత్వం అమలులోకి తేనుంది. ఈ స్కీము కింద రూ. 10 వేల నుంచి రూ. కోటి దాకా నగదు ప్రైజ్​గా గెలుచుకునే ఛాన్స్​ ఉంటుంది. ఏదైనా కొన్న ప్రతిసారీ బిల్లు అడిగేలా అలవాటును పెంపొందించే దిశలో ప్రభుత్వం ఈ చొరవ తీసుకుంటోంది. అసోం, గుజరాత్​, హర్యానా, పుదుచ్చేరి, దామన్​ అండ్​ డయ్యు, దాద్రా అండ్​ నగర్​ హవేలిలలో మొదటగా ఈ స్కీమును అమలులోకి తెస్తున్నట్లు సెంట్రల్​ బోర్డ్​ ఆఫ్​ ఇండైరెక్ట్​ టాక్సెస్​ అండ్​ కస్టమ్స్​ (సీబీఐసీ) ప్రకటించింది. జీఎస్​టీ ఇన్వాయిస్​లను అప్​లోడ్​ చేయడం ద్వారా క్యాష్​ ప్రైజులు గెలుచుకోవడానికి ఇన్వాయిస్​ ఇన్సెంటివ్​ స్కీము వీలు కల్పిస్తుందని పేర్కొంది. జీఎస్​టీ రిజిస్టర్డ్ సప్లయర్లు  ఇచ్చే జీఎస్​టీ ఇన్వాయిస్​లు అన్నీ ఈ స్కీము కింద అర్హమైనవేనని, మంత్లీ, క్వార్టర్లీ డ్రా ఉంటాయని వివరించింది. మేరా బిల్​ మేరా అధికార్​ స్కీములో భాగం పంచుకోవడానికి కనీసం రూ. 200 విలువైన కొనుగోళ్లను చేయాల్సి ఉంటుంది. నెలకి గరిష్టంగా 25 ఇన్వాయిస్​లను ఒక్కో కన్జూమర్​ అప్​లోడ్​ చేయొచ్చు.