ఆదుకున్న  హార్దిక్.. బెంగళూరు టార్గెట్–169

ఆదుకున్న  హార్దిక్.. బెంగళూరు టార్గెట్–169

బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో చివరి రెండు ఓవర్లలో గుజరాత్ బ్యాటర్లు ధాటిగా ఆడారు.  టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్‌కు ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. గిల్ (1) విఫలమయ్యాడు. ఆ తర్వాత కాసేపటికే వేడ్ (16) కూడా  పెవిలియన్ చేరాడు. ఇలాంటి సమయంలో క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్యా (62 నాటౌట్) జట్టును ఆదుకున్నాడు. సాహా (31) రనౌట్ అవడంతో.. డేవిడ్ మిల్లర్ (34)తో కలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడాడు.

అయితే ఇన్నింగ్స్ వేగం పెంచే క్రమంలో మిల్లర్ అవుటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన తెవాటియా (2) కూడా నిరాశ పరిచాడు. ఇలాంటి సమయంలో రషీద్ ఖాన్ (6 బంతుల్లో 19 నాటౌట్), హార్దిక్ కలిసి చివరి రెండు ఓవర్లలో 34 పరుగులు చేశారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ జట్టు 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. బెంగళూరు బౌలర్లలో హాజిల్‌వుడ్ రెండు వికెట్లు తీయగా.. మ్యాక్స్‌వెల్, హసరంగ చెరో వికెట్ తీసుకున్నారు.