GT vs RR: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026) సీజన్ క్లైమాక్స్‌కు చేరుకుంది. లీగ్‌లో మరో కీలక సమరానికి వేదిక సిద్ధమైంది. న్యూ చండీగఢ్‌లోని మహారాజా యాదవీంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ జట్లు క్వాలిఫయర్-2లో తలపడనున్నాయి. ఈ చావో రేవో పోరులో గెలిచిన జట్టు.. గ్రాండ్ ఫైనల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో టైటిల్ కోసం పోటీ పడనుంది.
రెండు జట్ల జర్నీ ఇలా:
* గుజరాత్ టైటాన్స్: క్వాలిఫయర్-1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో గుజరాత్ దారుణంగా ఓడిపోయింది. ఆ మ్యాచ్‌లో ఆర్‌సీబీ పూర్తి ఆధిపత్యం చెలాయించడంతో 2022 ఛాంపియన్స్ అయిన గుజరాత్‌కు గట్టి షాక్ తగిలింది. ఈ మ్యాచ్‌లో గెలిచి ఫైనల్ చేరి బెంగళూరుపై ప్రతీకారం తీర్చుకోవాలని శుభ్‌మన్ గిల్ సేన పట్టుదలతో బరిలోకి దిగబోతుంది.
* రాజస్థాన్ రాయల్స్: మరోవైపు, ఎలిమినేటర్ మ్యాచ్‌లో ప్యాట్ కమిన్స్ సారథ్యంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను చిత్తుగా ఓడించిన రాజస్థాన్ క్లీన్ క్లాస్ ప్రదర్శనతో క్వాలిఫయర్-2లోకి ఎంట్రీ ఇచ్చింది. ముఖ్యంగా టీనేజ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర ఫామ్‌లో ఉండటం ఆ రాయల్స్ జట్టుకు కొండంత బలాన్ని ఇస్తోంది.
హెడ్ టు హెడ్ రికార్డులు:
ఐపీఎల్ చరిత్రలో గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య గత రికార్డులను పరిశీలిస్తే గుజరాత్‌దే పైచేయిగా కనిపిస్తోంది. ఈ ఇరు జట్లు ఇప్పటి వరకు మొత్తం 10 మ్యాచులలో పోటీ పడ్డాయి. అందులో గుజరాత్ టైటాన్స్ 7 విజయాలు సాధించగా, రాజస్థాన్ రాయల్స్ కేవలం 3 మ్యాచుల్లోనే గెలిచింది. రికార్డుల పరంగా గుజరాత్ స్ట్రాంగ్ గా ఉన్నప్పటికీ, ప్రస్తుత ఫామ్ రాజస్థాన్ వైపు ఉండటంతో ఈ మ్యాచ్ అత్యంత ఉత్కంఠభరితంగా సాగడం ఖాయంగా కనిపిస్తుంది.
ఇరు జట్ల పూర్తి స్క్వాడ్స్
గుజరాత్ టైటాన్స్: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), నిశాంత్ సింధు, వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, జేసన్ హోల్డర్, రషీద్ ఖాన్, కగిసో రబడా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ
ఇంపాక్ట్ ప్లేయర్లు: రాహుల్ తెవాటియా, సాయి కిషోర్
ALSO READ : వైభవ్ సూర్యవంశీని ఆపడం ఎలా?
రాజస్థాన్ రాయల్స్: వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రియాన్ పరాగ్ (కెప్టెన్), డోనావన్ ఫెరీరా, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, నాండ్రే బర్గర్, సుశాంత్ మిశ్రా, యష్ రాజ్ పుంజా, బ్రిజేష్ శర్మ
ఇంపాక్ట్ ప్లేయర్: ఆడమ్ మిల్నే, శుభమ్ దూబే
