Vaibhav Suryavanshi: ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ తరపున 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ పరుగుల సునామీ సృష్టిస్తున్నాడు. మ్యాచ్ మ్యాచ్‌కూ తన ఫియర్‌లెస్ బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లకు నరకం చూపిస్తున్నాడు. మే 27న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన హై-ప్రెషర్ ఎలిమినేటర్ పోరులో ఈ టీనేజ్ సెన్సేషన్ కేవలం 29 బంతుల్లోనే 97 రన్స్ చేసి, 334.48 స్ట్రైక్ రేట్‌తో చెలరేగాడు. క్రిస్ గేల్ పేరుపై ఉన్న 30 బంతుల సెంచరీ రికార్డును బ్రేక్ చేసే అవకాశాన్ని తృటిలో (కేవలం 3 పరుగుల తేడాతో) మిస్ చేసుకున్నాడు. ఈ క్రమంలో అతడిని ఎలా ఆపాలో తెలియక క్రికెట్ ప్రపంచం తలలు పట్టుకుంటుండగా.. సోషల్ మీడియాలో ఫన్నీ పోస్టులకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే 'ఐస్‌లాండ్ క్రికెట్' ఈ చర్చలోకి ఎంట్రీ ఇచ్చి ఒక క్రేజీ పోస్ట్ పెట్టింది.
ఐస్‌లాండ్ క్రికెట్ ఫన్నీ ట్వీట్:
వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర ఇన్నింగ్స్ చూసిన తర్వాత ఐస్‌లాండ్ క్రికెట్ బోర్డు తమదైన శైలిలో స్పందించింది. "వైభవ్ ని ఎలా ఆపాలో మాకు తెలుసు.. మా దేశంలోని లావా (అగ్నిపర్వత శిలలు)తో కూడిన పిచ్‌లపై ఆడించడమే అతడిని ఆపడానికి ఉన్న ఏకైక మార్గం అని సరదాగా ట్వీట్ చేసింది. ఐస్‌లాండ్ దేశంలో ఉన్న అగ్నిపర్వతాలు, అక్కడి విచిత్రమైన భౌగోళిక పరిస్థితులను బేస్ చేసుకుని పెట్టిన ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
ఆరెంజ్ క్యాప్ రేసులో సిక్సర్ల కింగ్:
ఐపీఎల్ 2026 ఆరెంజ్ క్యాప్ రేసులో వైభవ్ సూర్యవంశీ 680+ పరుగులతో అగ్రస్థానంలో దూసుకుపోతున్నాడు. ఈ సీజన్‌లో వైభవ్ సృష్టించిన కొన్ని అద్భుతమైన రికార్డులు ఇవే!
* రన్స్ & స్ట్రైక్ రేట్: ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 15 మ్యాచ్‌లు ఆడిన వైభవ్.. 242.85 మైండ్ బ్లోయింగ్ స్ట్రైక్ రేట్‌తో, 45.33 యావరేజ్‌తో 680 పరుగులు కొట్టాడు. ఇందులో ఒక సెంచరీ, నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
ALSO READ : మమ్మల్ని చూసి ఈల వేశాడు..
* గేల్ రికార్డ్ బ్రేక్: ఒకే ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక సిక్సర్లు (65) కొట్టిన ఆటగాడిగా క్రిస్ గేల్ (2012లో ఆర్‌సీబీ తరపున 59 సిక్సర్లు) పేరిట ఉన్న ఆల్-టైమ్ రికార్డును వైభవ్ బ్రేక్ చేశాడు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 55 ఫోర్లు, 65 సిక్సర్లు బాదాడు.
We know how to stop Vaibhav Sooryavanshi and our lava-bedded wickets are the way to do it.
— Iceland Cricket (@icelandcricket) May 27, 2026
