ఐపీఎల్ 2023లో ఆసక్తికర పోరు జరుగుతోంది. గుజరాత్ లోని నరేంద్రమోదీ స్టేడియంలో అన్నదమ్ములు ఢీకొట్టుకుంటున్నారు. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కృనాల్ పాండ్యా మధ్య జరిగే క్రికెట్ సమరం మొదలైంది. ఇందులో భాగంగా టాస్ గెలిచిన లక్నో..బౌలింగ్ ఎంచుకుంది. లక్నో సూపర్ జెయింట్స్ ఫుల్ టైమ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ గాయపడటం వల్ల జట్టు సారధ్య బాధ్యతలను ఆల్ రౌండర్ కృనాల్ పాండ్యా అందుకున్నాడు.
ఈ సీజన్‌లో గుజరాత్, లక్నో జట్లు చెరో 10 మ్యాచ్‌లు ఆడాయి. ఇందులో ఏడు మ్యాచుల్లో విజయం సాధించిన గుజరాత్ పాయింట్ల పట్టికలో నెంబర్ వన్ లో ఉంది. ఐదు మ్యాచుల్లో గెలిచిన లక్నో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఈ సీజన్‌లో ఈ రెండు జట్లు ముఖాముఖిగా తలపడడం ఇది రెండో సారి. గత మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 7 పరుగుల తేడాతో లక్నోపై విజయం సాధించింది.
గుజరాత్ టైటాన్స్ XI: శుభ్ మన్ గిల్, వృద్ధిమాన్ సాహా (wk), హార్దిక్ పాండ్యా (కెప్టెన్), విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, అభినవ్ మనోహర్, రాహుల్ తేవాటియా, రషీద్ ఖాన్ , నూర్ అహ్మద్, షమీ, మోహిత్ శర్మ.
లక్నో సూపర్ జెయింట్స్ XI: డి కాక్ (wk), K మేయర్స్, దీపక్ హుడా, స్వప్నిల్ సింగ్, స్టోయినిస్, నికోలస్ పూరన్, కృనాల్ పాండ్యా (c), యశ్ ఠాకూర్, ఆవేశ్ ఖాన్, రవి బిష్ణోయ్, మోసిన్ ఖాన్